తల్లి అయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..

By | January 23, 2022

అద్దె గర్భం ద్వారా తల్లులుగా మారుతున్నారు. ముఖ్యంగా సినీ తారలు ఇలా తల్లులుగా మారుతున్నారు. మంచు లక్ష్మి ఇలానే తల్లి అయ్యింది. షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు సరోగసీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిస్తున్నారు. షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు సరోగసీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిస్తున్నారు.

బాలివుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఇలానే పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలా అద్దె గర్భంతో తల్లి అయ్యింది. బాలివుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇలానే తల్లి అయ్యింది. ప్రియాంక చోప్రా ఎప్పుడూ గర్భంతో ఉన్నట్లు ఎటువంటి న్యూస్, ఫోటోలు బయటకు రాలేదు. అలాంటిది ఆమె ఎలా తల్లి ఐంది అనే అనుమానం రావచ్చు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ‘సరోగసి విధానం ద్వారా ఓ బిడ్డని పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము.

ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు. అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఇది ప్రియాంక ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ న్యూస్ అనే చెప్పాలి. పూజా హెగ్డే, హ్యూమా క్యురేషి లాంటి సెలెబ్రిటీలు ప్రియాంకకు సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పారు.హాలీవుడ్ లో సింగర్ గా రాణిస్తున్న నిక్ జోనస్ పరిచయం కావడంతో అతడి ప్రేమలో పడింది. 2018లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడు ప్రియాంక బిడ్డను చూసుకోవడం లో బిజిగా ఉన్నారు.. ఇప్పటిలో సినిమాలు చెయ్యదని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.