అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్17న ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా లోని ప్రతి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. సినిమా వచ్చి చాలా రోజులు అయిన పాటలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఈ పాటలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినీ తారలు, సాదరన ప్రజల తో పాటుగా క్రికెటర్స్ కూడా తమలోని టాలెంటె ను బయట పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో క్రికెటర్ శ్రీవల్లి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అదరహో అనిపించారు.
ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్న రైనా ఇప్పుడు శ్రీవళ్లి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ పాటకు తన స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నట్లు స్టెప్పులేశాడు.’నేనే స్టెప్పులేయకుండా ఆగలేకపోతున్నాను. నా స్టైల్లో నేను ట్రై చేశాను. సూపర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నావు అల్లుఅర్జున్ బ్రదర్.. ఈ సినిమా మరింత సక్సెస్ ను అందుకొవాలని కోరుకుంటున్నా అని రైనా అన్నారు రైనా..