రూ. 500 కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..

By | January 24, 2022

500 రుపాయల కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వైనం ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది.. వివరాల్లొకి వెళితే..బీహార్‌లో జాముయ్‌ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు.

అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్‌ షాట్‌ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్‌వైఫ్‌ రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్‌ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్‌ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.