ఆటో డ్రైవర్ నా.. మజకా..

By | January 24, 2022

అతను ఒక ఆటో డ్రైవర్ చదివింది తక్కువే కానీ అతని ఆలోచనలు మాత్రం హైలెవల్ అనే చెప్పాలి.తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మాలి.అది నిజమే అతని ఆలోచన బాగుంది అంటూ అతని ఆటో ఎక్కిన వాళ్ళు అంటున్నారు.అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్‌ మెన్ వరకూ అందరికీ ఉపయోగపడే సదుపాయాలు కల్పించాడు..

ఇది నిజంగానే గ్రేట్ అని మెచ్చుకొవాలి. ఆటోలో ప్రయానిస్తున్న అంత సేపు ఆటో లో వెళ్తున్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు. అంతేకాదండోయో మధ్యలో ఆకలేస్తే తినడానికి స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేశాడు.. ఈ ఆలోచన అందరికి రాదనె  చెప్పాలి.బిజినెస్‌ చేయాలంటే డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదని రుజువు చేసాడు. ఇది చెన్నైలో వెలుగు చూసింది.ఆటో-రిక్షా డ్రైవర్ అన్నా దురై వ్యాపారవేత్త అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆలోచించె వాడు..కానీ కుటుంబ పరిస్థితుల వల్ల అలాంటివి చేయలేక పోయాడు. పెద్దగా చదువుకోలేక పోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published.