పవన్ కళ్యాణ్ కొత్త కండిషన్స్ ఒప్పుకుంటే సినిమా..

By | January 24, 2022

పవర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలు చేయాలంటే కొత్త కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది.భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్ విషయంలో ఆందోళన పట్టుకున్నదంట.

పవన్ కొత్తగా ఒక కండిషన్ పెట్టారని, దానివలన డైరెక్టర్లందరూ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఆ కండిషన్ ఏంటీ అంటే.. పవన్ షూటింగ్ కోసం కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తానని, అంతకుమించి ఎక్కువ కుదరదని తేల్చి చెప్పాడంట. ఏం చేసినా.. తాను ఇచ్చిన 60 రోజుల్లోనే తన షూటింగ్ పార్టును ముగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే దర్శకులకు టెన్షన్ తప్పదు. హీరో కాల్షీట్లు తక్కువ ఉంటే షూటింగ్ ని పరుగులు తీయించాలి.రాజకియాల్లొ చురుగ్గా వుండాలని ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.