భర్తను చంపడానికి మాస్టర్ ప్లాన్.. సాంబర్ లో విషం కలిపి..

By | January 25, 2022

భర్త వుండగానే మరో వ్యక్తి మోజులో పడిన భార్య భర్తను చంపడానికి ప్లాన్ వేసింది. దాని కోసం సాంబర్ లో విషం కలిపి చంపే ప్లాను వేసింది. ఈ ఘటన చెన్నై లో వెలుగు చూసింది.నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్‌ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌. కీలయూర్‌ యూనియన్‌ డీఎంకే కౌన్సిలర్‌ అయిన ఈయన పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు.

దేవేంద్రన్‌ మృతి తరువాత అతని భార్య సూర్య  ఎవరితోనో ఫోన్‌లో తరచూ మాట్లాడుతుండడంతో సందేహించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా దేవేంద్రన్‌ భార్య సూర్యాకు అదే ప్రాంతానికి చెందిన ఇంజినీరు చంద్రశేఖర్‌ కు వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న దేవేంద్రన్‌కు సాంబార్‌లో విషం కలిపి తినిపించి హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published.