వీడి పిచ్చికి తిక్క కుదిరింది..

By | January 25, 2022

విష జంతువులతో పరాచకాలు ఆడొద్దు అని అందరూ పదే పదే పెద్దలు చెబుతున్నారూ..కానీ కొందరు ఎదో అనుకొని సాహసం చేస్తారు.దాంతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్‌ నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్‌ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు.

అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్‌ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్‌ఫోన్‌ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.