చంద్ర మోహన్ కూతురు ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరోయినో తెలుసా?

By | February 10, 2022

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటులలో మనం గొప్పగా మాట్లాడుకునే నటులలో ఒక్క చంద్ర మోహన్, కెరీర్ ప్రారంభం లో హీరో గా ఈయన ఒక్క వెలుగు వెలిగాడు, అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు వంటి నటుల తర్వాత చంద్ర మోహన్ కూడా ఎన్నో సెన్సషనల్ సూపర్ హిట్ సినిమాలలో హీరోగా రాణించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు, ఆ తర్వాత వయస్సు పెరగడం మరియు చిరంజీవి, బాలకృష్ణ వంటి యువ హీరోలు ఇండస్ట్రీ రావడం తో పోతూ వాతావరణం నెలకొంది, ఆ పోటీ వాతావరణం లో చంద్ర మోహన్ ఇమడలేకపొయ్యారు, దాని వల్ల ఆయన హీరో పాత్రలకు దూరం అయ్యి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు, క్యారక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ మారినప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే వికాసం మల్లి రాలేదు అనే చెప్పాలి, ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ క్యారక్టర్ ఆర్టిస్టులలో ఒక్కరిగా చంద్ర మోహన్ ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాడు, ముఖ్యం గా తండ్రి పాత్రలంటే మనకి ముందు గుర్తుకు వచ్చే పేరు చంద్ర మోహన్ గారే, ఎందుకంటే ఆయనని చూస్తే మన నిజ జీవితం లో తండ్రులు గుర్తుకు వస్తారు, అందుకే ఆయనకీ ఇప్పటికి తండ్రి పాత్రలకు ఆ రేంజ్ డిమాండ్ ఉంది.

ఇది ఇలా ఉండగా చంద్ర మోహన్ కి సంబంధించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము, చంద్ర మోహన్ ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఆయన తర్వాత ఇండస్ట్రీ నిలదొక్కునే వారసులు ఎవ్వరు రాలేదా అనే సందేహం మీ అందరికి ఇది వరకే చాలా సార్లు వచ్చి ఉంటుంది, కానీ చంద్ర మోహన్ యువకుడిగా సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలతో దూడుకుపోతున్న సమయం లోనే ఆయన కుటుంబం నుండి ఒక్క అమ్మాయి ఇండస్ట్రీ కి వచ్చి ఒక్క సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనే విషయం చాలా మందికి తెలియదు, ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో కళా తపస్వి కె విశ్వనాధ్ గారు తెరకెక్కించిన సప్తపది అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా లో హీరోయిన్ గా సబితా అనే అమ్మాయి నటించింది, ఈమె ఎవరో కాదు, చంద్ర మోహన్ సొంత తమ్ముడి కూతురు, అంటే చంద్ర మోహన్ కి కూడా కూతురు వరుసలోకి వస్తుంది,ఈ సినిమాలో మరీముఖ్యంగా హీరోయిన్ పాత్రకే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు, ఈ సినిమా ద్వారా సబితా కి క్రేజ్ మాములుగా రాలేదు అనే చెప్పాలి.

అసలు సబితా అనే అమ్మాయి విశ్వనాధ్ గారి దృష్టిలో ఎలా పడింది అంటే, విశ్వనాధ్ గారు ఒక్కనొక్క సందర్భం లో హైదరాబాద్ లో రవీంద్ర భారతి లో జరిగే ఒక్క ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు అట,క్లాసికల్ డాన్స్ లో గొప్ప ప్రావిణ్యం ఉన్న సబితా ఆ ఈవెంట్ లో నృత్య ప్రదర్శన ఇచ్చింది, తన సినిమాకోసం ఒక్క కొత్త అమ్మాయి ని ఎంచుకోవాలి అని ఎంతో కాలం నుండి ఆడిషన్స్ చేస్తున్న విశ్వనాధ్ గారికి, సబితా ని చూడగానే మరో ఆప్షన్ ని ఎంచుకోకుండా వెంటనే తనని హీరోయిన్ గా తన సినిమాలో తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు అట, అప్పటి వరుకు సబితా నటుడు చంద్ర మోహన్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనే విషయమే ఆయనకి తెలియదు అట, ఆ అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకునే క్రమంలో ఆమె చంద్ర మోహన్ కి కూతురు వరుస అవుతుంది అనే విషయం బయటపడింది అట, తొలుత చంద్ర మోహన్ కుటంబ సభ్యులు ఎవ్వరు కూడా సబితా ని సినిమాల్లోకి పంపడానికి ఏ మాత్రం అంగీకరించలేదు అట, కానీ చంద్ర మోహన్ చొరవ తో ఆమె ఆ ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆమెకి క్రేజ్ ని మరియు వరుసగా హీరోయిన్ అవకాశాలను తెచ్చిపెట్టినా, ఆమె దానికి అంగీకరించలేదు, ఆ సినిమా తర్వాత ఇంట్లో వాళ్ళు చూపించిన పెళ్లి సంబంధం ని చేసుకొని విదేశాల్లో స్థిరపడిపోయింది, ఒక్కవేల ఆమె వచ్చిన అవకాశాలను ఒప్పుకొని సినిమాలు చేసి ఉంటె ఈరోజు పెద్ద స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగేది ఏమో.

Leave a Reply

Your email address will not be published.