పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

By | February 10, 2022

మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోలలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా మనం ఉండలేము, కేవలం సినిమా హీరోగానే కాదు వ్యక్తిగతంగా ఆయనకీ ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అవుతారు, అందుకే పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు, కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అని అందరు అంటూ ఉంటారు, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్త్వం ఉన్న పవన్ కళ్యాణ్ తన తోటి హీరోలను ఎంతగానో గౌరవిస్తాడు, మన టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని సినిమా హీరోగా కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా ఇష్టపడతారు, తమిళనాడు లో కూడా అక్కడి టాప్ హీరోస్ అందరికి ఇష్టమైన ఏకైక తెలుగు హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే, ఇది ఇలా ఉండగా ఒక్కప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒక్క సంఘటన చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో బయటపడి తెగ వైరల్ గా మారింది, అది ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా , మరియు జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన దమ్ము సినిమా సమ్మర్ లో రెండు వారాల గ్యాప్ తో విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ రెండు సినిమాల ఫలితాల సంగతి పక్కన పెడితే షూటింగ్ సమయం లో ఈ రెండు సినిమాల మధ్య ఒక్క చిక్కు ఏర్పడింది, అదేమిటి అంటే దమ్ము సినిమా పొలాచ్చి లో ఒక్క షెడ్యూల్ ని జరుపుకోవాల్సి ఉంది, సరిగ్గా దమ్ము షూటింగ్ జరుపుకునే సమయంలోనే సమె లొకేషన్ లో గబ్బర్ సింగ్ షూటింగ్ ని కూడా ప్లాన్ చేసారు,అప్పటికే దమ్ము సినిమా షూటింగ్ జరుపుకోడం కోసం ఆ ప్రాంతం లీజ్ కి తీసుకోడం ఆ చిత్ర నిర్మాత ప్రయత్నిస్తున్నాడు,కానీ అప్పటికే ఆ ప్రాంతం లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుపుకోడం కోసం ఆ స్థలం కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్, కానీ దమ్ము సినిమా షెడ్యూల్ ప్రకారం జరగకపోతే ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల నిర్మాతకి చాలా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది.

ఇక ఇదే విషయం ని దమ్ము సినిమా నిర్మాత ఎన్టీఆర్ కి తెలపగా ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ కి ఫోను చేసి ఉన్న పరిస్థితి ని వివరించాడు అట, దానికి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ తో ఏకీభవించి తన గబ్బర్ సింగ్ సినిమా పొలాచ్చి షెడ్యూల్ ని తన దర్శక నిర్మాతలతో మాట్లాడి వాయిదా వేయించాడు అట, అప్పటి నుండి పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది అట, అప్పట్లో రామ్ చరణ్ నిశ్చితార్ధ వేడుక లో పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ సన్నిహితంగా చాలా సేపు మాట్లాడుకుంటున్న వీడియో అప్పట్లో ఒక్క సెన్సేషన్ సృష్టించింది,ఇప్పటికి ఈ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది, ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అరవింద సామెత చిత్రం ప్రారంభోత్సవం కి కూడా ముఖ్య అతిధి గా హాజరు అయిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇలా ఒక్కప్పుడు జరిగిన ఈ అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published.