బిగ్ బాస్ సీసన్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది

By | February 10, 2022

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రతి ఏడాది సరికొత్త సీసన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు , ఈ షో ప్రసారం అయ్యే దినాలలో జనాలకు బిగ్ బాస్ షో ని చూడడం ఒక్క అలవాటుగా మారిపోయింది, ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ ని ప్రారంబించుకునేందుకు సిద్ధం అవుతుంది,ఇప్పటి వరుకు ప్రారం అయినా అన్ని సీసన్స్ ఒక్క దానిని మించి ఒక్కటి ప్రత్యేకతని చాటుకుంటూ అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సంపాదించింది, స్టార్ మా ఛానల్ అయితే ఈ షో ప్రసారం అవుతానప్పటి నుండి ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇది ఒక్క రికార్డు అని చెప్పొచ్చు , అయితే ఇంతకు ముందు సీసన్ కి సీసన్ కి మధ్య కనీసం ఆరు నెలలు గ్యాప్ అయినా కచ్చితంగా ఉండేది, కానీ ఈసారి బిగ్ బాస్ సీసన్ 6 ని కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ప్రారంభించబోతున్నారు, ఇందుకు సంబంధించిన కంటెస్టెంట్స్ ని ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టు సమాచారం, ఒక్కసారి ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

బిగ్ బాస్ సీసన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కంటే ఈసారి పాల్గొనే కంటైస్టెంట్స్ మన అందరికి సుపరిచితం అయినా వాళ్ళే అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం,వాళ్లెవరో ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళితే,ఉయ్యాలా జంపాల వంటి సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ఆ తర్వాత ఎన్నో క్రేజీ హిట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజ్ తరుణ్ బిగ్ బాస్ సీసన్ 6 లో పాల్గొనబోతున్నట్టు సమాచారం, ఇక ఇప్పుడిఇపుడే ఇండస్ట్రీ లో సూపర్ హిట్స్ కొడుతూ ముందుకు దూసుకుపోతున్న ప్రముఖ హీరో సంతోష్ శోభన్ కూడా బిగ్ బాస్ సీసన్ 6 లో పాల్గొనబోతున్నట్టు సమాచారం, ఈయన ఇప్పటి వరుకు ఏ మినీ కథ , మంచి రోజులు వచ్చాయి వంటి సూపర్ హిట్ సినిమాలతో మరియు బేకర్స్ అండ్ బ్యూటీ అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు, ఇక వీరితో పాటు నటి సురేఖ వాణి,నటి ప్రగతి మరియు ఛత్రపతి చంద్ర శేఖర్ వంటి పాపులర్ క్యారక్టర్ ఆర్టిస్టులతో పాటు జబర్దస్త్ తో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న చమ్మక్ చంద్ర అలాగే బుల్లితెర టాప్ యాంకర్ వర్షిణి కూడా ఈ బిగ్ బాస్ సీసన్ 6 రియాలిటీ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారు.

ఇక గత మూడు సీసన్స్ నుండి ఈ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,మొదటి సీసన్ కి జూనియర్ ఎన్టీఆర్ రెండవ సీసన్ కి న్యాచురల్ స్టార్ నాని వ్యక్తలుగా వ్యవహరించారు, అయితే ఇప్పుడు ఆరవ సీసన్ కి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉంది ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇప్పటికే బాలయ్య బాబు ఆహా ఓటీటీ ఛానల్ లో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎంబీకే ప్రోగ్రాం అద్భుతమైన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో వ్యాక్యతగా వ్యవహరించిన బాలయ్య బాబు కి అద్భుతమైన పేరు వచ్చింది, బాలయ్య బాబు లో ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందా అని చూసే ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ షో,అలాంటి బాలయ్య బాబు ని మల్లి హోస్ట్ గా తీసుకుంటే ముందు ప్రసారం అయినా బిగ్ బాస్ షోస్ అన్నిటి కంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నట్టు సమాచారం, ఈ రియాలిటీ ఫిబ్రవరి చివరి వారం నుండి ప్రసారం అవ్వబోతుంది అట, ఈ రియాలిటీ షో కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియచెయ్యబోతుంది స్టార్ మా ఛానల్.

Leave a Reply

Your email address will not be published.