హీరో వేణు తొట్టెంపూడి భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా?

By | February 11, 2022

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు స్వయంకృషి తో పైకి వచ్చి గొప్ప స్టార్స్ అయ్యారు ,మరి కొంత మంది కెరీర్ తోలి నాళ్లలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత సడన్ గా మాయం అయిపోయారు, ముఖ్యంగా తరుణ్ మరియు ఉదయ్ కిరణ్ వంటి హీరోలు అప్పట్లో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంత తొందరగా అయితే వాళ్ళు క్రేజ్ సంపాదించారో అంతే తొందరగా ఆ క్రేజ్ ని పోగొట్టుకున్నారు, వారి కోవలోకి చెందిన మరో హీరో వేణు తొట్టెంపూడి, వేణు అంటే ఇప్పటికి ఫామిలీ ఆడియన్స్ లో ఒక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్న కూడా ఎందుకో ఆయన సుద్దెంగా వెండితెరకి దూరం అయిపోయారు, స్వయం వరం సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వేణు తొట్టెంపూడి తోలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన అద్భుతమైన నటన మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అందరిని తన వైపుకి తిప్పుకునేలా చేసాడు, ఈ సినిమా తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ కురిసిన కూడా చేతికి అందిన సినిమా చెయ్యకుండా చాల సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక్క బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకొని అగ్ర హీరో గా ఎదిగాడు.

సుమారు 26 సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి కెరీర్ లో ఎక్కువ శాతం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే ఉన్నాయి, స్వయం వరం ,చిరునవ్వుతో ,హనుమాన్ జంక్షన్ , పెళ్ళాం ఊరెళితే , ఖుషి ఖుషీగా ఇలా ఒక్కటా రెండా సుమారు 15 సినిమాలు భారీ విజయం సాధించాయి, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ 2006 వ సంవత్సరం నుండి సినిమాలు చెయ్యడం తగ్గిస్తూ వచ్చాడు, అడపాదప సినిమాలు ఏడాదికి ఒక్కటి చేస్తున్న ఎందుకో అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పొయ్యాయి, 2012 వ సంవత్సరం లో జూనియర్ ఎన్టీఆర్ మరియు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన దమ్ము సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన వేణు తొట్టెంపూడి నటనకి మంచి మార్కులు పడ్డాయి , ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా రామ చారి అనే సినిమా చేసాడు, ఇది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం తో ఆయన సినిమాలకు ప్రస్తుతం శాశ్వతంగా దూరం అయ్యారు అనే చెప్పాలి ,వెండితెర మీద అందరికి పరిచయం ఉన్న వేణు తొట్టెంపూడి వ్యక్తిగత విషయాలు మాత్రం చాల తక్కువ మందికి తెలుసు , ఇప్పుడు మేము ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము.

వేణు తొట్టెంపూడి తన కెరీర్ లో పీక్స్ టైం లో ఉన్నప్పుడే అనుపమ చౌదరి అనే అమ్మాయి ని పెళ్లాడాడు,ఈమె కన్నడ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించారు, 2001 వ సంవత్సరం లో వివాహం అయినా వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు, వీళ్ళ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీరు క్రింద చూడవచ్చు, ఇక వేణు తొట్టెంపూడి కి టాలీవుడ్ లో మాస్ హీరోగా ఎదిగిన గోపీచంద్ తొట్టెంపూడి స్వయానా తమ్ముడు అవుతాడు, ఈ విషయం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి, 2013 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయినా వేణు ఆ తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూ లలో కానీ, టీవీ లలో కానీ కనపడలేదు, కానీ చాలా కాలం తర్వాత ఆయన తెలంగాణ లో టీ ఆర్ ఎస్ పార్టీ కి మద్దతు పలుకుతూ 2019 వ సంవత్సరం లో రాజకీయ అరంగేట్రం చేసారు, ఆయన టీ ఆర్ ఎస్ పార్టీ తరుపున అప్పట్లో ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచారు, తన కెరీర్ లో ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేసిన వేణు తొట్టెంపూడి భవిష్యత్తులో టీ ఆర్ ఎస్ పార్టీ తరుపున ఏం ఎల్ ఏ గా పోటీ చేస్తారా లేదా అనేది ప్రశ్నర్థకంగా మారింది, మరి వేణు తొట్టెంపూడి భవిష్యత్తు లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా మారుతాడా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published.