రాజకీయాలకో నమస్కారం అంటున్న మోహన్ బాబు కారణం..?

By | February 14, 2022

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మోహన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు తన సినిమాలతో.. నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలతో ఎంతో మంది ప్రజలను కూడా మెప్పించగలిగాడు.. మోహన్ బాబు యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఎంతో మంది పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ మంచి భవిష్యత్తును కూడా కల్పిస్తున్నారు. ఈయన యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రమశిక్షణతో కూడుకొని.. గొప్ప స్థాయిలో ఉన్నారు అని చెప్పడానికి ఇప్పటికే మంచి పొజిషన్లో ఉన్న వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. తాజాగా మంచు మోహన్ బాబు రాజకీయాలకు ఒక పెద్ద నమస్కారం పెట్టేశారు.. అంతేకాదు తాను ఇకమీదట రాజకీయాల్లో ఉండనని కూడా తేల్చి చెప్పడం గమనార్హం..

మోహన్ బాబు మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా. రాజకీయాలలో అనుకున్న విధంగా ముందుకు సాగ లేకపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజ్యసభ సీటు పొలిటికల్ కెరియర్ లో స్థానం దక్కకపోవడం గమనార్హం. 1995లో ఎన్టీఆర్ ను కాదని చంద్రబాబు సైడ్ వెళ్లినప్పటికీ విజయాన్ని సాధించ లేకపోయారు. ఇక 1995 ప్రారంభంలో టీడీపీకి దూరమై బీజేపీకి మద్దతు ప్రకటించారు.. అప్పుడు వాజ్ పేయ్ హయాం లో ఆరేళ్ల పాటు కొనసాగినప్పటికీ మోహన్ బాబు ఏ పదవినీ ఆశించలేదు.. అలాగే ఆయనకు కూడా ఏ పదవి దక్కలేదు.. బంధువుగా , మిత్రుడిగా చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న మోహన్ బాబు రాజకీయపరంగా మాత్రం విభేదిస్తూ వచ్చాడు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి రాజకీయంగా భద్ర శతృవు జగన్ నాయకత్వం వైసీపీ లో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు.. మోహన్ బాబు రాజ్యసభ సీటును వైసీపీలో ఆశించారు అని కొంతమంది చెబుతారు. 2020 లో వైసీపీ కి నలుగురు ఎంపీలు నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది.. కానీ మోహన్ బాబుకు టిక్కెట్ ఇవ్వలేదని అసంతృప్తి ఉందని కూడా మరికొంత మంది చెబుతారు.. ఇకపోతే మరి కొద్ది నెలల్లో మరో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.. వాటిలో ఒకటి మోహన్ బాబుకు ఇస్తారని ఎక్కడ కూడా ప్రచారం జరగలేదు.. ఇక తరువాత చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ వచ్చింది అని ఇప్పుడు రాజ్యసభ పదవి అలికి ఇస్తున్నారు అంటూ మరో ప్రచారం జరిగింది..

ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుకు ఈసారి కూడా రాజ్యసభ సీటు దక్కలేదని అని అర్థమయిపోయింది.. కానీ మోహన్ బాబు తాజాగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ పనులలో బిజీగా ఉంటూ అందుకు సంబంధించిన విషయాలను చూసుకుంటూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.