వావ్ : చిరు – బాలయ్య నటించిన సినిమా ఏంటో తెలుసా..?

By | February 15, 2022

సినీ పరిశ్రమలో నటించే ఏ హీరో అయినా సరే మొదటి స్థానం సంపాదించుకోవడం కోసం ఇతర హీరోలతో పోటీ పడుతూనే ఉంటాడు. నటన పరంగా తమలో ఉన్న ప్రతిభను సినీ ప్రేక్షకులకు కనబరుస్తూ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడానికి పోటీ పడుతూ సినీ ప్రపంచంలో స్టార్ హీరోలుగా దూసుకుపోతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో అంతా మారుతోందని చూసుకోవచ్చు. అదేమిటంటే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఇద్దరినీ ఒకే చోట చేర్చి మల్టీస్టారర్ మూవీ లను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది అని చెప్పవచ్చు. మల్టీస్టారర్ మూవీల కు హీరోలు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ మూవీలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు కలిసి నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు – నందమూరి తారక రామారావు వంటి అగ్ర హీరోలు కూడా ఒకే స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ – ఏఎన్నార్, కృష్ణ – శోభన్ బాబు, కృష్ణంరాజు – చిరంజీవి లాంటి అగ్ర నటులు కలిసి నటించారు.అయితే హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. కథ డిమాండ్ చేయడంతో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.1990 తర్వాత హీరోల మధ్య ఇమేజ్ సమస్య తలెత్తింది.దీంతో మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మారుతున్నాయి.కాబట్టి స్టార్ హీరోలు మల్టీస్టారర్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ – పవన్ కళ్యాణ్ , తాజాగా రామ్ చరణ్ – ఎన్టీఆర్, వెంకటేష్- వరుణ్ తేజ్ , చిరంజీవి రామ్ చరణ్ ఇలా ఎంతోమంది కాంబినేషన్లో తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని అట మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందరికీ తెలియని ఒక షాకింగ్ విషయం ఏమిటంటే వీరిద్దరూ కలిసి ముందే నటించారు అని.. ఇక ఆ సినిమా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. వెంకటేష్ హీరోగా చేసిన త్రిమూర్తులు సినిమాలోని ఓ పాటలో చిరంజీవి, బాలయ్య కనిపిస్తారు. వీరితో పాటు నాగార్జున, శోభన్ బాబు, కృష్ణ కూడా ఈ పాటలో డ్యాన్స్ చేస్తారు.ఆ తర్వాత వీరు మరే సినిమాలో కనిపించలేదు. వీరిద్దరూ ఆ పాటలో ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.