ఖిలాడీ మూవీ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన మాస్ మహారాజ రవితేజ

By | February 17, 2022

క్రాక్ లాంటి సెన్సషనల్ హిట్ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ నటంచిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడీ, ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికి రవితేజ బ్రాండ్ ఇమేజి వల్ల మంచి ఓపెనింగ్స్ మరియు వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ పరంగా ఎబోవ్ యావరేజి దిశగా ముందుకి దూసుకుపోతుంది,ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు జరగగా , మొదటి మూడు రోజుల్లోనే 10 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి 50 శాతం రికవరీ ని పొందింది, ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తోంది అనే అంచనాలో ఉన్నారు బయ్యర్లు, మొత్తానికి అతి తక్కువ నష్టాలతోనే ఈ సినిమా బిజినెస్ త్వరలో ముగియబోతుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, క్రాక్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ కి బాగా కలిసి వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇక పుష్ప సినిమా బాలీవుడ్ లో సృష్టించిన ప్రభంజనం చూసి ఖిలాడీ సినిమాని కూడా విడుదల చేసారు, మొదటి రోజు హిందీ లో రెండు కోట్ల రూపాయిల నెట్ ని సాధించిన ఈ చిత్రం, ఇప్పటి వరుకు 5 కోట్ల రూపాయిల నెట్ వసూలు చేసి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మ కి మరియు రవితేజ కి మధ్యలో గొడవలు చాలానే జరిగాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త , అది నిజమేనని ఖిలాడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినప్పుడు అందరికి అర్థం అయ్యింది, ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన రవితేజ డైరెక్టర్ రమేష్ వర్మ కి మాత్రం చెప్పలేదు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనీసం అతనిని పట్టించుకోలేదు కూడా, ఇది చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా వీళ్లిద్దరి నిజంగానే గొడవ జరిగింది అని ఫిక్స్ అయిపోయారు, అసలు ఎందుకు వీరి మధ్య గొడవ జరిగింది అంటే, రమేష్ వర్మ ఖిలాడీ సినిమాని ఒక్క పాపులర్ తమిళ్ సూపర్ హిట్ స్టోరీ ప్లాట్ ని తీసుకొని తెరకెక్కించాడు అట, సినిమా చేస్తున్న సమయం లో రషెష్ చూసిన రవితేజ ఔట్పుట్ సరిగా రాలేదు అని , మనం పూర్తిగా ఆ సినిమాని రీమేక్ చెయ్యడం బెస్ట్ అని డైరెక్టర్ కి చెప్పడట, కానీ అందుకు రమేష్ వర్మ ఒప్పుకోలేదు, దర్శకుడి అభిప్రాయం కి గౌరవించి రవితేజ కూడా ఆ తర్వాత మారు మాట్లాడకుండా సినిమాని పూర్తి చేసాడు, కానీ ఆఖరి ఔట్పుట్ చూసిన తర్వాత రవితేజ తీవ్రమైన అసంతుప్తి కి గురి అయ్యాడట.

దీనితో అప్పటి నుండి డైరెక్టర్ రమేష్ వర్మ తో మాట్లాడడం మానేసాడు అట రవితేజ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నిర్మాత మీద అభిమానం తో వచ్చినట్టు తెలుస్తుంది, కానీ ఈ సినిమా ప్రొమోషన్స్ లో కానీ, సక్సెస్ మీట్ లో కానీ పాల్గొనే సమస్యే లేదు అని రవితేజ నిర్మాతకి గట్టిగ చేప్పేసాడు అట, దీనితో రవితేజ లేకుండానే ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ ని చేసింది ఆ చిత్ర బృందం, రవితేజ గతం లో కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి మొహమాటం కొద్దీ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి , అవి ఫ్లాప్ అయినప్పుడు ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు,ఈ విషయం ని స్వయంగా ఆయనే పలు ఇంటర్వూస్ లో చెప్పాడు, కానీ తానూ సలహా ఇచ్చిన తర్వాత కూడా లెక్క చెయ్యకుండా ఇలా చేసినందుకు మాత్రం రవితేజ చాలా హర్ట్ అయ్యాడట, ఇక రవితేజ ప్రస్తుతం రామ రావు ఆన్ డ్యూటీ మరియు రావణాసుర వంటి సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు, వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రవితేజ ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం, ఇందులో రవితేజ చిరంజీవి తమ్ముడిగా కనిపించబోతున్నారు అట, గతం లో రవితేజ హీరో గా కెరీర్ లో నిలదొక్కుకుంటున్న సమయం లో చిరంజీవి తో అన్నయ్య అనే సినిమాలో నటించాడు, ఇప్పుడు మాస్ మహా రాజా గా ఎదిగిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు చిరంజీవి తో కలిసి నటిస్తుండడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published.