చిరంజీవి తో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్, పెద్ద స్టార్ హీరోయిన్ అని మీలో ఎంత మందికి తెలుసు ?

By | February 17, 2022

సినిమాల్లో హీరో, హీరోయిన్స్, విల‌న్స్, కమెడీయ‌న్స్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్ ఎంత ముఖ్య‌మో…చైల్డ్ ఆర్టిస్టులు అంతే ముఖ్యం. చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతో మంది బాల తార‌లు ఉత్త‌మ న‌టులుగా నంది అవార్డ్స్ తో పాటు, జాతీయ అవార్డులు అందుకున్న‌వారు వున్నారు. కొన్ని సినిమాల్లో బాల తార‌లుగా న‌టించి వారి ముద్దు మాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటారు. వారిలో ముందువ‌రుస‌లో వుండే చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా శ‌ర్మ‌. 2005లో చిరంజీవి హీరోగా వ‌చ్చిన సినిమా జై చిరంజీవ… ఆ సినిమాలో చిరంజీవికి చిన్నారి మేన‌కోడ‌లు గా న‌టించింది శ్రియా శ‌ర్మ‌.. ఆ సినిమాతోనే తెరంగ్రేటం చేసింది. ఇప్పుడు శ్రియా శ‌ర్మ చిన్నారి కాదు. త‌న దైన శైలిలో త‌న ఇష్ట‌మైన ఫీల్డ్ లో దూసుకుపోతుంది. అసలు ఇప్పుడు శ్రియా శ‌ర్మ‌ని చూస్తే ఎవ‌రు గుర్తుప‌ట్ట‌లేరు. బుట్టబొమ్మ‌లా మారిన ఈ చిన్నారి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసుకుందాం?హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో వికాస్ శ‌ర్మ‌, రితు దంపతుల‌కి 1997లో జన్మించింది శ్రియా శ‌ర్మ‌.

శ్రియా తండ్రి వికాస్ శర్మ ఇంజనీరు. తల్లి రితు న్యూట్రిషియ‌న్‌. శ్రియా శ‌ర్మ‌కి 2005లో జై చిరంజీవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలి అవ‌కాశం అందుకుంది. ఈ అవ‌కాశం రావ‌టానికి ముందు నుంచే శ్రియా పలు టీవీ యాడ్స్ క‌నిపించింది. పియ‌ర్స్ సోఫ్, రెడ్ లెబుల్ టీ, సంతూర్ సోఫ్‌, కోల్గెట్‌, చెన్నై సిల్క్స్‌, శ‌ర‌వ‌ణ్ స్టోర్స్ వంటి యాడ్ ఫిల్మ్స్ క‌నిపించి సంద‌డి చేసింది. బుల్లితెర‌పై శ్రియా శ‌ర్మ దాదాపు 150 యాడ్స్ లో న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రియా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది. 2011 లో వ‌చ్చిన బాలీవుడ్ సినిమా చిల్ల‌ర పార్టీలో న‌టించిన శ్రియాకి చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డ్ కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత హిందీ సినిమాల‌తో పాటు దూకుడు, తూనీగ తూనీగ‌, ర‌చ్చ‌, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, సినిమాల్లో బాల‌న‌టిగా న‌టించింది.2016 లో వ‌చ్చిన నిర్మ‌లా కాన్వేంట్ సినిమాలో శ్రియా శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది.

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించాడు. ఈ సినిమా కంటే ముందు గాయ‌కుడు అనే మూవీలో శ్రియా శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. ఆ సినిమా ఆమెకి అనుక‌న్నంత గుర్తింపు తీసుకురాలేదు. ప్ర‌జెంట్ ఈ భామ మోడ‌లింగ్ పై దృష్టి పెట్టింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా వుండే శ్రియా త‌న‌కి సంబంధించిన లెటెస్ట్ పోటోస్ తో పాటు, త‌న అప్ డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పాలోవ‌ర్స్ తో షేర్ చేసుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published.