బుల్లితెర యాంకర్ లలో అత్యధిక సంపన్నుడు అతడేనా..?

By | February 17, 2022

యాంకర్లే కదా అనుకోవద్దండి.. వాళ్ళు రోజుకి ఎంత సంపాదిస్తున్నారో.. నెలకు ఎంత సంపాదిస్తున్నారో.. అలా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో… తెలిస్తే కొందరికి గుండె ఆగినంత పనవుతుంది. అలా అనుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే మన దగ్గరున్న యాంకర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఈ విషయం నమ్మటానికి కష్టంగా అనిపించినా ఇది నమ్మాల్సిన నిజం అలా అని అందరి యాంకర్ల సంపాదన అలాగే ఉంటుందనుకుంటే అది పొరపాటే.. కొందరు మాత్రం బాగానే వెనకేసు కుంటున్నారు. ఢీ, జబర్దస్త్ యాంకర్స్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు.

తెలుగులో గొప్ప పేరును తెచ్చుకున్న యాంకర్లలో ప్రదీప్, సుడిగాలి సుదీర్ ,రవి , హైపర్ ఆది ఈ లిస్టులో ఉన్నారు. వీళ్ళకి సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంత పెద్ద పేరు ఉన్న వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? వీళ్లు కూడబెట్టిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ప్రదీప్ ఒక షో కి రూ. 3 లక్షల వరకు పుచ్చుకుంటారు. సినిమా ఫంక్షన్ కి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోగా మారాడు ఆ సినిమాకి దాదాపు రూ. 35 లక్షల పారితోషకం అందుకున్నారు. ఫస్ట్ సినిమా కాబట్టి తక్కువ పేమెంట్ నీ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రదీప్ కి రూ.10 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

రవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. దాదాపుగా 5 ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా సంథింగ్ స్పెషల్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, పటాస్ గ్యాంగ్ లీడర్, సూపర్ మామ, సరిలేరు నీకెవ్వరు .. లాంటి ఎన్నో షోలు చేశారు. వీటిలో కొన్ని షోలు ఇంకా నడుస్తున్నాయి. దాదాపు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ ఉంటుందట.. రవికి బంజారా హిల్స్ లో ఒక ఫ్లాట్ ఉంది. దాదాపు రూ. 5 కోట్ల ఆస్తి ఉంటుందట

ఇకపోతే సుడిగాలి సుధీర్ గురించి చెప్పనవసరమే లేదు. జబర్దస్త్, డీ, పోవే పోరా లాంటి షో లలో చాలా బాగా చేశారు. కమెడియన్ గానూ, హీరో గాను మారాడు. తన సంపాదన మొదట్లో రూ. 20వేలు.. ఇప్పుడు రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. సినిమా ఫంక్షన్ కి దాదాపు రూ. 2లక్షల వరకు పుచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ.. రూ.5 కోట్లు ఉంటాయి.

తన నటనతోనూ తన కామెడీతో లో మనుషులని ఎంతో ఆకట్టుకున్న ఆది జబర్దస్త్ తో ఎంతో పేరును సంపాదించుకున్నాడు. అయినా ఆది పంచులకి పడి పడి నవ్వాల్సిందే.. ఆది కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.ఆది కమెడియనే కాదు మంచి రైటర్ మరియు ఆర్టిస్ట్ అనే చెప్పాలి. దాదాపు 20 ఎకరాల పొలం 4 ప్లాట్లు 3 ఖరీదైన కార్లు 2సొంత ఇల్లులు , బంగారం ఇవన్నీ కలిపితే రూ.4 కోట్ల లేదారూ. 5 కోట్లు ఉంటాయి. అని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరందరి కంటే ప్రదీప్ కి ఎక్కువ ఆస్తి ఉందని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published.