ఎంతో అందంగా ఉండే సింధు మీనన్ ఇప్పుడేంటి ఇలా అయిపొయింది.. గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే..

By | February 18, 2022

వెండి తెర‌పై వెన్నెల అంత అందం. వారి అందం చూడ‌టానికి ప్రేక్ష‌కులు ధియేట‌ర్స్ కి క్యూ క‌డ‌తారు. కొంత‌మంది హీరోయిన్స్ గ్లామ‌ర్ గా, కమ‌ర్షియ‌ల్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తారు. ఇంకొంత‌మంది మాత్ర‌మే ప‌క్కంటి అమ్మాయిలా , హోమ్లీగా క‌నిపిస్తారు. అలా క‌నిపించే హీరోయిన్స్ లో ముందు వ‌రుస‌లో వుండే అందాల తార సింధు మీన‌న్‌. చంద‌మామ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సుంద‌రి వెండితెర‌కి బాల‌న‌టిగా ప‌రిచ‌యం అయింది. సౌతిండియా భాష‌ల్లో న‌టించిన చంద‌మామ భామ 2010 లో వివాహం చేసుకుని యూకే సెటిల్ అయింది. పెళ్లి త‌ర్వాత అంత‌కు ముందు సైన్ చేసిన రెండు మూడు సినిమాలు కంప్లీట్ చేసి యూకే వెళ్లిపోయింది. ప్ర‌జెంట్ ఈభామ‌ను చూస్తే అస‌లు గుర్తు ప‌ట్టేలేరు. యూకే ఇప్పుడు ఎలా వుందో ఏమి చేస్తుందో తెలుసుకుందాం. భ‌ద్రాచలం మూవీతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మైన సింధు మీన‌న్ , 1994 లో క‌న్న‌డ సినిమా ర‌ష్మీలో బాల న‌టిగా తెరంగ్రేటం చేసింది. క‌న్న‌డ సినిమాలో బాల‌న‌టిగా, యంగ్ గ‌ర్ల్ గా వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ భామ 2001లో భ‌ద్రాచ‌లం సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయింది.

Sindhu Menon

కృష్ణ వంశీ సినిమా చంద‌మామ సినిమాలో మాస్ క్యారెక్ట‌ర్ లో న‌టించి న‌టిగా మంచి మార్కులే కాదు గుర్తింపు కూడా సొంతం చేసుకుంది. చిన్న‌త‌నం నుంచే సింధు మీన‌న్ భార‌త నాట్యంలో శిక్ష‌ణ తీసుకుంది. ఒక డ్యాన్స్ చిన్నారి సింధు డ్యాన్స్ టాలెంట్ గ‌మ‌నించిన ఒక జ‌డ్జి …ఆమెను ర‌ష్మి డైరెక్ట‌ర్ కి పరిచ‌యం చేశాడు. అలా సింధు మీన‌న్ అడుగులు సినిమా రంగం వైపు ప‌డ్డాయి. సింధు మీన‌న్ 13 ఏళ్ల వ‌య‌స్సులోనే హీరోయిన్ గా అవ‌కాశాలు దక్కించుకుంది. హీరోయిన్ గా క‌న్న‌డ‌లో ఆమె తొలి చిత్రం ప్రేమ‌, ప్రేమ‌, ప్రేమ‌. భ‌ద్రాచ‌లం సినిమాలో న‌టించే స‌మ‌యానికి సింధుమీన‌న్ వ‌య‌స్సు 15 ఏళ్లు.. హీరోయిన్ సింధు మీన‌న్ తెలుగు, త‌మిల‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది. తెలుగులో ఈ భామ చివ‌రిగా న‌టించిన చిత్రం సిద్దం. చిన్న వ‌య‌స్సులో హీరోయిన్ అవ‌కాశాలు అందుకున్న సింధు మీన‌న్ వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. త‌న కెరీర్ ఊపందుకుంటున్న టైమ్ లో పెళ్లి చేసుకుని లైప్ లో సెటిల్ అయింది.

Sindhu Menon

లండన్ లోని సాప్ట్‌వేర్ ఇంజినీర్ డొమినిక్ ప్ర‌భుని2010 ఏప్రిల్ లో పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. వీళ్ల‌కి స్వెత్లానా అనే పాప, ఒక బాబు వున్నారు. సింధు త‌న ఫ్యామిలీ తో లండ‌న్ లో సెటిల్ వుంటుంది. 2012 నుంచి సింధుమీన‌న్ వెండితెర‌కే కాదు…బుల్లి తెర‌కి దూరంగా వుంది.

Leave a Reply

Your email address will not be published.