అటు సినీ , ఇటు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. అ అంటే అందమే అనసూయ అనేంత గా వ్యూవర్స్ ను ఆకట్టుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్ తోపాటుగా స్విలర్ స్క్రీన్ పై కూడా సందడి చేస్తుంది ఈ గ్లామరస్ యాంకర్. సోషల్ మీడియాలో తన లెటెస్ట్ ఫిక్స్ అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అనసయా…ఓ పోస్ట్ గతం లో సన్సేషనల్ అయింది. ఓ అగ్ర హీరోని బావ అంటూ పిలిచింది. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ యంగ్ లుక్ లో చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. న్యూస్ రీడర్ గా స్మాల్ స్క్రీన్ పై కెరీయర్ స్టార్ట్ చేసిన అనసూయ..యాంకర్ గా సక్సెస్ కావటానికి చాలా ప్రయత్నాలే చేసింది. ఎంబీఏలో హెచ్ ఆర్ చేసిన అనసూయ న్యూస్ రీడర్ కంటే ముందుగా ఓ బ్యాంక్ లో టెలి కాలర్ గా వర్క్ చేసింది. అక్కడే అనుసూయ తొలి జీతం అందుకుంది అది రూ.5వేలు. ఆ తర్వాత ఓ కామెడీ షోకి యాంకరింగ్ చేసే చాన్స్ తగిలింది.

అప్పటి వరకు ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో యాంకర్ అంటే ఓ మూస పద్దతిలో వుండేవారు. అనసూయ యాంకర్ గా ఆ పద్దతులను బ్రేక్ చేసింది. కొత్త ట్రేండ్ సెట్ చేసింది. యాంకర్స్ కూడా మోడ్రన్ డ్రెస్సులో గ్లామర్ గా కనిపిస్తే జనాలు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ లో 2013లో ఫిబ్రవరి 7న మొదలైన ఓ కామెడీ షోకి ఇప్పటికి అనసూయే యాంకరింగ్ చేస్తుంది. ఆ కామెడీ షో కి మొదట్లో అనసూయ అందం, ఆమె పరువాల ప్రదర్శన బాగా ప్లస్ అయింది. అంకాదు కాదు కామెడీ స్కిట్స్ లో అవసరమైనప్పుడు కామెడీ టీమ్ తో కలిసి నటిస్తోంది. ఆది టీమ్ తో కలిసి అనసూయ చేసే సందడిని, అనసూయ-ఆది మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయి చేస్తారు. ఈ కామెడీ షో తర్వాత యాంకర్ గా అనసూయ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అని అనటంలో ఎటువంటి అనుమానం లేదు.

స్టార్ యాంకర్ గా మారిపోయింది. సినిమా ఆడియో ఫంక్షన్స్ దగ్గర నుంచి ఎంటర్ టైన్ మెంట్స్ చానెల్స్ వచ్చే రియాల్టీ గేమ్ షోల్లో అనసూయ యాంకర్ గా కనిపించాల్సిందే. 2003 లో ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో కాలేజీ స్టూడెంట్స్ లో ఓ అమ్మాయి కనిపించిన అనసూయ యాంకర్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2016లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లో నటించింది ఆ తర్వాత ఈ భామ కొన్ని సినిమాల్లో నటించి లేటెస్ట్ గా పుష్ప సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పును పొందుతుంది అనసూయా. అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె జబర్దస్త్ లో స్టేజి మీద వేసే డాన్స్ కి అభిమానులు చాలా మందే ఉన్నారు. కేవలం అనసూయ డాన్స్ కోసం, అనసూయ కోసం జబర్దస్త్ చుసే వాళ్ళు ఉన్నారు. ఇక అనసూయ డాన్స్ చేసిందంటే అందరూ అలా చూస్తుండిపోవాల్సిందే. ఇక సామి సామి పాటకి వేసిన డాన్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.