నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకుని చివరకు అలా మారిన ప్రముఖ హీరోయిన్

By | February 18, 2022

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కోటీశ్వరులు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నిర్మాతలుగా మారి కోట్లు సంపాదించిన వాళ్లు ఉన్నారు. అలాగే నిర్మాతలుగా మారి చాలా మంది ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. అందుకే సినిమా పరిశ్రమ ఎవరిని ఎప్పుడు ఎటు తీసుకువెళ్తుందో చెప్పడం కష్టం. అందుకే అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలను ఆసరాగా చేసుకుని నాలుగు రాళ్లు వేనకేసుకోవాలి. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉన్న సమయంలో ఎలాంటి తప్పటడుగులు వేసినా… ఇండస్ట్రీలో వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అలాంటి తప్పులే చేసి మహానటి సావిత్రి అత్యంత దుర్భరంగా చివరి రోజులు గడిపి కన్నుమూసింది. ఆమె చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం, అనేక దానధర్మాలు చేయడం కారణంగా కష్టాలపాలైంది. సావిత్రి తరహాలో హీరోయిన్ దేవయాని కూడా కొన్ని తప్పులు చేసి కోలుకోలేని దెబ్బ తిన్నది. దేవయాని గురించి మీకు తెలిసే ఉంటుంది. సుస్వాగతం సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. సుస్వాగతం సినిమాకు ముందు, తర్వాత కూడా పలువురు స్టార్ హీరో పక్కల కూడా నటించి పేరు పొందింది.

అయితే స్టార్ హీరోయిన్ దేవయాని కూడా కొన్ని తప్పులు చేసి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. బెంగాలీ సినిమాతో 1993లో కెరీర్ మొదలు పెట్టిన హీరోయిన్ దేవయాని ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాలు చేసి హిట్లు అందుకుంది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి సుస్వాగతం లాంటి సూపర్ హిట్ సినిమా చేసింది. అనంతరం హీరో శ్రీకాంత్‌తో మాణిక్యం అనే సినిమాలో నటించింది. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి 90 సినిమాల్లో నటించింది. ఆమె కీ రోల్ పోషించిన పలు సీరియళ్ల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. వాస్తవానికి దేవయాని అసలు పేరు సుష్మ. ఆమె కెరీర్ అంతా సంప్రదాయ పాత్రల్లోనే నటించింది. హీరోయిన్‌గా ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలను నిర్మించింది. అయితే దేవయాని నిర్మించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తనకున్న ఆస్తినంతా పోగొట్టుకుంది.

అలా ఆర్థికంగా చతికిలపడిన దేవయాని.. చివరకు ఓ స్కూలులో టీచర్‌గా చేరింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తల్లి పాత్రల్లో కూడా నటిస్తోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మళ్లీ బిజీ అవుతోంది. దేవయాని గతంలో సుస్వాగతం, శ్రీమతి వెళ్లొస్తా, మాణిక్యం, చెన్నకేశవరెడ్డి, నాని, లవ్ స్టోరీ, రొమాంటిక్ సినిమాల్లో నటించింది. దేవయాని ముంబైలోని కొంకణి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జయదేవ్, తల్లి లక్ష్మీ. ఆమెకు నకుల్, మయూర్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు. నకుల్ తమిళ సినిమా రంగంలో నటుడు, గాయకుడిగా పనిచేస్తున్నాడు. మయూర్ ఇటీవలే ఒక సినిమాలో నటుడిగా అరంగేట్రం చేశాడు. తనతో కొన్ని సినిమాల్లో కలిసి పని చేసిన తమిళ సినిమా దర్శకుడు రాజకుమారన్‌ను దేవయాని చాలా ఏళ్లుగా ప్రేమించింది. ఇరువురి ఇంట్లో పెద్దవాళ్లు వారి ప్రేమను అంగీకరించపోయినా పారిపోయి 2001, ఏప్రిల్ 9న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. దేవయాని, రాజకుమారన్ దంపతులకు ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.