హర్షవర్ధన్.. ఈ పేరు వినగానే చాలా మందికి అమృతం సీరియల్ గుర్తుకొస్తుంది.. అమృతం సీరియల్ ఫైనల్ టచ్ లో అమృత రావు పాత్రలో హర్షవర్ధన్ నటించి మంచిమార్కులు సంపాదించారు.. అంతేకాదు మిగిలిన వారిని పక్కన పెడితే ఈయన మాత్రమే తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు అని చూసిన అభిమానులు కూడా చేయడం గమనార్హం. ఇకపోతే నటుడిగా కూడా తనలోని ప్రతిభ చాటిన హర్షవర్ధన్ మంచి రైటర్ కూడా.. ఒకానొక సందర్భంలో తన స్క్రిప్టు ను కాపీ కొట్టి తన పేరును కూడా వేయలేదు అని.. అలా మోసం చేశారు అని హర్షవర్ధన్ తన ఆరోపణలు వినిపిస్తున్నాడు..

నితిన్ హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇష్క్.. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా హర్షవర్ధన్ పని చేశాడు . ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కి కూడా డైలాగ్ రైటర్ గా పని చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాదు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేయమని నాకు అవకాశం అందించారు. ఇక విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమాకు అలాగే నాగార్జున నటించిన మనం సినిమాకి కూడా డైలాగ్ రైటర్‌గా పని చేశాను అని హర్షవర్ధన్ తెలియజేశారు. నితిన్ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కూడా మంచి హిట్ ని సంపాదించడం తో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు హర్షవర్ధన్.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ మరికొన్ని విషయాలను తెలియజేస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా, స్క్రిప్టు రైటర్‌గా పని చేశాను.. కానీ వారంతా దొంగతనంగా స్క్రిప్టులు కాపీ కొట్టేసి నా పేరును కూడా వేయకుండా మోసం చేశారు. అంతేకాదు ఎక్కడ కూడా నా పేరు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ విధంగా డైలాగులు, స్క్రిప్టు వాడుకొని బాగా ఫేమస్ సంపాదించుకున్న వారు ఇప్పుడు బానే ఉన్నారు.. కానీ నేను మాత్రం అలా బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
స్క్రిప్టు రాసేటప్పుడు లేదా డైలాగ్ రాసేటప్పుడు ఏదైనా ఒక డైలాగ్ నచ్చకపోయినా సరే మొత్తం సన్నివేశాన్ని మార్చేస్తాను అని హర్షవర్ధన్ తెలిపాడు. ఏది ఏమైనా ఎవరు గుర్తింపు వాళ్లకు లభిస్తేనే మరింత ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది వల్ల నేను దారుణంగా మోసపోయామని హర్షవర్ధన్ తెలిపాడు.
AP Police Recruitment 2022 Notification Scientific Assistant Jobs Apply Online @ appolice.gov.in
RBI Assistant Recruitment 2022