Rashmika : హీరోయిన్ రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

By | February 21, 2022

Rashmika : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో క్యూటెస్ట్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అందుకే కావచ్చు రష్మిక కి నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ ఇండస్ట్రీలలో కూడా రష్మీక సత్తా చాటుతోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అక్టీవ్ గానే ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అదేవిధంగా రష్మిక బాలీవుడ్లో కూడా ఇటీవలే హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మిషిన్ మజ్ను చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. పాకిస్తాన్లో భారతదేశ గూడచారి సంస్థ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు భాగిచి దర్శకత్వం వహిస్తున్నారు. మిషిన్ మజ్ను చిత్రాన్ని ఈ ఏడాది మే లో విడుదల చేయడానికి చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. పుష్ప సినిమా హిట్ తర్వాత రష్మిక కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. స్టార్ హీరోల వరుస మూవీ ఆఫర్స్ రష్మిక కు క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. అలాగే ఒక్కో యాడ్ చేస్తే డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట ఈ నేషనల్ క్రష్.. ఇప్పటివరకు రష్మిక 37 కోట్ల వరకు వెనకేసుకు వచ్చిందట. ఈమె ఏడాదికి సుమారుగా 5 మిలియన్ల వరకు సంపాదిస్తుందట. అలాగే రష్మిక కాస్ట్లీ రేంజ్ రోవర్ కారును కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఈ కారు విలువ కోటి పైగానే ఉంటుందట. 25 ఏళ్ల వయసులోనే రష్మిక ఇన్ని కోట్లు సంపాదించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రష్మిక పుష్ప పార్ట్ 2 చిత్రంలో బిజీగా ఉంది.

One thought on “Rashmika : హీరోయిన్ రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Leave a Reply

Your email address will not be published.