RRR చిత్రాన్ని వదులుకొని తప్పు చేశానంటున్న హీరోయిన్..!!

By | March 29, 2022

తెలుగు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని, ప్రఖ్యాత ను అమాంతం పెంచేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం తో పాటు తెలుగు సినిమా ను ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేశారు ఈ దర్శకుడు. బాహుబలి, బాహుబలి-2,RRR వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని గుర్తించేలా చేశారు. ఈ చిత్రాలు అన్ని భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వీటితోపాటుగా మరెన్నో సినిమాలు కూడా అన్ని భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టాయి.

అంతేకాకుండా తెలుగు సినిమాలను సైతం ఇతర భాషలలో చేసేందుకు కొంత మంది హీరో, హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇక అలాగే తెలుగు సినిమాలలో నటించేందుకు కూడా ఇతర ఇండస్ట్రీలో హీరోయిన్లు, హీరోలు కూడా తెగ ఆతృతతో ఉన్నారు. అలా RRR లో ఆలియా భట్ కూడా నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో ఇమే స్థానంలో నటించేందుకు ఒక హీరోయిన్ ని అడగడం జరిగిందట ఆమె రిజెక్ట్ చేయడంతో ఆలయ భట్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఈ సినిమాను వదులుకున్నందుకు చాలా బాధపడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది వాటి గురించి చూద్దాం.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో మల్టీస్టారర్ గా రూపొందించిన ఈ చిత్రం కేవలం మొదటి మూడు రోజులలోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సృష్టించి ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.. రామ్ చరణ్ సరసన సీతగా ఆలియాభట్ నటించగా.. ఎన్టీఆర్ ను ప్రేమించిన యువతిగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించింది అయితే ఈమె పాత్రకు ముందుగా కత్రినాకైఫ్ సోదరి ఇసాబెల్లా ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.. అయితే అప్పట్లో ఆమె సినిమాలలో భాగం కావడానికి నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఆమె స్నేహితుల వద్ద తెలుపుతూ పశ్చాత్తాపం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఈ చిత్రంలో ఉండి ఉంటే ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది ఉండేదేమో. ప్రస్తుతం ఆమె టైమ్ టు డాన్స్ అనే ఒక ఫిలింలో నటిస్తున్నది. ఏది ఏమైనా ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published.