‘రుతురాగాలు’ ఆనంద్ రాజా.. జూనియర్ ఎన్టీఆర్ కు బంధువు..:

By | April 15, 2022

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేమస్ అయిన నటులు మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఎన్నో కళలతో పరిశ్రమకు వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన వారు.. తమ జీవితాన్ని మాత్రం పూర్తిగా గడపలేకపోయారు. అలాంటి నటుల్లో ఆనంద్ రాజా అనే నటుడి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. వెండితెరతో పాటు బుల్లితెరపై అలరించిన ఆయన అకాల మరణం చెంది మనమధ్య లేకుండాపోయారు. వెండితెరై స్వప్న అనే సినిమాతో అలరించిన ఆయన అమ్మాయిలకు నచ్చిన హీరో. అయితే ఈ రాజాతో జూనియర్ ఎన్టీఆర్ కు బంధుత్వం ఉంది. అశ్చర్యం అనిపించినా ఇది నిజంగా నిజం. ఈయనతో జూనియర్ కు ఎలాంటి చుట్టరికం ఉందో ఇప్పుడు చూద్దాం..

‘స్వప్న’ అనే సినిమాతో ఆనంద్ రాజాను దాసరి నారాయణ రావు వెండితెరకు పరిచయం చేశారు. అప్పట్లో లవ్ సినిమాల్లో ఇది సంచలనంగా మారింది. దీంతో ఆనంద్ రాజాకు అభిమానులు చాలా మంది ఉండేవారు. సినిమాల్లో హీరోగానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ గా కూడా ఆనంద్ రాజా అలరించాడు. కొన్ని సినిమాల్లో నటించిన ఆయన ఆ తరువాత బుల్లితెరపై కూడా అలరించారు. మంజుల నాయుడు తీసిన ‘రుతురాగాలు’ సీరియల్ లో ఆనంద్ రాజా ప్రముఖంగా కనిపిస్తాడు. దూరదర్శన్లో ప్రసారమైన ఈ సీరియల్ కోసం అప్పటి లేడీస్ ఎంతగానో ఎదురుచూసేవారు. అలాగే ప్రియసఖి, అన్వేషిత అనే సీరియల్ లో కూడా నటించారు.

అయితే ఆనంద్ రాజా ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. గుండెపోటుతో మరణించడంతో సినీ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ఏఎన్నార్ తో కలిసి ఓ సినిమా ప్లాన్ వేయగా ఆనంద్ రాజా అకాల మరణంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆనంద్ రాజా తెలుగులో ఫేమస్ అయ్యాడు. అయితే ఆనంద్ రాజాకు జూనియర్ ఎన్టీఆర్ కు బంధుత్వం ఉంది. అదెలా అంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లి ద్వారా.

Jr NTR Mother Shalini surprised everyone ఎన్టీఆర్‌ వార్తకు బలం చేకూరుతోంది!

ఎన్టీఆర్ తల్లిపేరు షాలిని. ఈమె జన్మస్థం కర్ణాటక రాష్ట్రం. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ షాలినిని రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో వీరి వివాహాన్ని పెద్దాయన ఒప్పుకోకపోయినా ఆ తరువాత అంగీకరించారు. దీంతో షాలిని కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ పెరిగి స్టార్ హీరోగా మారాడు.

Jr NTR Mother And Wife Pranathi at Nandamuri Harikrishna's House | TFPC -  YouTube

అసలు విషయానికస్తే ఎన్టీఆర్ తల్లి షాలిని సొదరిని ఆనంద్ రాజా పెళ్లి చేసుకున్నాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఆనంద్ రాజా బాబాయ్ అవుతాడన్నమాట. అలా వీరిద్దరు బంధువులు అవుతారు. అయితే ఆనంద్ రాజా ఇప్పుడుంటే జూనియర్ కు మరింత బలం ఉండేంది. అందుకే ఎన్టీఆర్ కు తెలుగుతో పాటు కన్నడంలోనూ అభిమానులు విపరీతంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.