బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి మానేశారు..?

By | April 16, 2022

భారతదేశంలో మాంసహారం తినడంపై ఇప్పటికీ సందిగ్ధమే నెలకొంది. ఇక్కడ భిన్న సంస్కృతులు ఉండడం వల్ల ఆహారపు అలవాట్లలో చాలా తేడాలున్నాయి. దక్షిణాన రైస్ తో కడుపు నింపుకుంటే ఉత్తరాన గోధుమ రొట్టెతో తమ ఆకలిని తీర్చుకుంటారు. అయితే ఈ ఆహారంలో మాంసం వినియోగించేవారు.. వినియోగించని వారూ ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీ హవా సాగుతోంది. దీంతో కొందరు బీజేపీకి సంబంధించిన వారు బీఫ్ వంటకంపై వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో తొమ్మిది రోజుల పాటు మాంసం విక్రయాలు నిలపాలని బిజేపీకి చెందిన ఎంపీ పర్వేశ్ శర్మ అన్నారు. కానీ అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే కొందరు ఇలాంటి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సీనియర్ విశ్లేషకులు విలువైన విషయాలు బయటకు తీస్తున్నారు. వాస్తవానికి భారతదేశంలో సింధు నాగరికత కాలంలోనే గోవు, పంది మాంసాన్ని తినేవారని..కాల క్రమంలో ఏర్పడిన పరిస్థితుల మూలంగా వాటిని నిషేధిస్తున్నారని అంటున్నారు.

భారత్ లో మాంసాహారానికి, శాకాహారానికి సుధీర్ఘమైన చరిత్ర ఉంది. అయితే ఏదో ఒకదానికి మద్దతుగా ఉండాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారు. మతాల ప్రభావంతో కొందరు మాంసాహారాన్ని వదిలేయాలని అంటున్నారు. కానీ మాంసం తినే అలవాటి ఇప్పటిదీ కాదని, సింధు నాగరికత నుంచి వస్తోందని కొందరు వాదిస్తున్నారు. క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్య కాలంలో ఆవు, ఇతర జంతువుతను బలి ఇవ్వడం చాలా సర్వసాధారణ విషయమని అంటున్నారు. కొందరు రాజులు దండయాత్రలు, కొన్ని దేశాల మధ్య వ్యాపారం, వ్యవసాయం విధానాల వల్ల ఆహారపు అలవాట్లు మారిపోయాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా 16వ శతాబ్దం వరకు దక్షిణ భారతేదశంలో బ్రాహ్మణులు మాంసం తిన్నారని తమ పరిశోధనలో తేలిందని డాక్టర్ భట్టాచార్య వెల్లడించారు. ఉత్తరాదిలో బ్రాహ్మణులు, కొన్ని అగ్రకులాల వారు 19వ శతాబ్దం చివరలో మాంసాహారాన్ని వదిలేశారని అంటున్నారు. వలస పాలనతో పాటు భూ వినియోగం, వ్యవసాయ విధానాలు, ఆధునిక భారతీయ ఆహారపు అలవాట్ల కారణంగా బియ్యం, గోధుమలు, పప్పుల వినియోగం పెరిగిందని అంటున్నారు. అయితే భారతీయ ఆహారపు అలవాట్లలో కొన్ని నియామాలను విధించారు. కొందరు బ్రాహ్మణ కుటుంబాల్లో మాంసం తినడం తప్పు కాదు. కశ్మీర్ పండిట్లు మేక మాంసాన్ని స్థానికంగా పండే మిర్చితో కలిపి వండుకొని తింటారు. బెంగాల్ తో పాటు కొంకణ్ తీరంలో బ్రాహ్మణులు రకరకాల చేపలు వండుకొని తింటారు.

భారతీయ ఆహారపు అలవాట్లపై ప్రభుత్వాలు కొన్ని సర్వేలు నిర్వహించాయి. 2021లో నిర్వహించిన సర్వే ప్రకారంల గ్రామీణ కుటుంబాల్లో నాలుగింట ఒక వంతు, పట్టణాల్లో ఐదో వంతు మాంసం తింటున్నట్లు తేలింది. అయితే మిగతా వారు శాకాహారులు అని అర్థం కాదు. వారు ఏదో ఒకరోజు మాత్రమే మాంసాహారాన్ని తీసుకుంటారు. కానీ కొందరు నిపుణులు మాత్రం సర్వేల ద్వారా ఆహారపు అలవాట్లను అంచనా వేయలేమని, కింది కులాల వారు మాసం తింటామని చెప్పడానికి నిరాకరిస్తారని అంటున్నారు. దీని కారణంగా ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు వచ్చాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.