చాన్నాళ్లకు ఎన్టీఆర్ కల అలా నెరవేరింది..

By | April 16, 2022

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వంశానికున్న ప్రత్యేకత ఏంటో తెలియంది కాదు. స్వర్గీయ ఎన్టీరామారావు వారసులుగా ఎందరో హీరోలు, నటులు ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ సంతానంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ను పోలి ఉంటాడు. అయితే మొదట్లో అనేక కష్టాలు ఎదుర్కొన్న జూనియర్ వాటిని అధిగమించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సీనియర్ ఎన్టీరామారావు పేరు నిలబెడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యతరం సినీ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందు బాలకృష్ణ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ, జూనియర్ కలిసి స్టేజీమీద చూడలన్న తనప నందమూరి అభిమానులకు ఉండేది. కానీ ఓ సారి ఆ సందర్భం వచ్చింది. ఈ సమయంలో జూనియర్ బావోద్వేగానికి గురయ్యాడు. ఆ సన్నివేశం గురించి ఇప్పుడు చూద్దాం..

బాల రామయణం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా ‘నిన్ను చూడాలని’ సినిమాతో జూనియర్ హీరో అయ్యాడు. అయితే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ఈ యంగ్ టైగర్ అందరికీ సుపరిచితుడయ్యాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో హిట్లు, ఎన్నో అపజయాల సినిమాల్లో నటించినా ఎన్టీఆర్ కు మాత్రం స్టార్ డమ్ తగ్గలేదు. ఆయన ఏ సినిమాలో నటించిన యూత్ లో జోష్ పుట్టుకొస్తుంది. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర అయినా అందులో ఇమిడిపోయే తత్వం ఎన్టీఆర్ ది..

అలాంటి ఎన్టీఆర్ రియల్ లైఫ్లో ఓసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఫంక్షన్ కు బాలయ్య రావడంపై ఆనంద బాష్పాలను వదిలాడు. 2001వ సంవత్సరం సినీ గోయర్స్ అవార్డుకు ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఈ అవార్డును అందజేయడానికి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వచ్చారు. అప్పటికే ఎన్నో రోజులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ లు కలిసి ఒకే స్టేజీపై ఉంటే ఎంత బాగుంటుందోనని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ ఫంక్షన్లో ఇద్దరు కలిసి ఒకే వేదికపై ఉండడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈలలు, గోలలతో సందడి చేశారు.

ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యారు. బాబాయ్ తనకు అవార్డు ఇవ్వడం చూసి బావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ అప్పటికీ.. ఇప్పటీకీ.. బాబాయ్ కింగ్ అని అన్నాడు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడడానికి తాత తారకరామారావు, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇలా తన ఫ్యామిలీ గురించి వ్యాఖ్యలు చేయడంపై అక్కడున్న సినీ పెద్దలు సైతం సంతోషాన్న వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.