ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఏది హిట్టు కొట్టిందో తెలుసా..?

By | April 16, 2022

తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు స్వర్ణయుగంలా సాగింది. మంచి కథలతో ఉన్న సినిమాలను పెద్ద హీరోలు పోటీ పడి సినిమాలు తీశారు. ఆనాటి సినిమాల్లో విషయం ఉండడంతో కచ్చితంగా వంద రోజుల వరకు నడిచేవి. ముఖ్యంగా 1990 నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీస్ గా నిలిచాయి. ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి హీరోలు మంచి కథలను చూజ్ చేసుకొని సినిమాలను చేసేవారు. ఈ తరుణంలో 1992లో ఒకేసారి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేశ్ ల సినిమాలు రోజుల తరబడి గ్యాప్ తో విడుదలయినా అన్నీ సక్సెస్ మూవీస్ గా నిలిచాయి. ఆ సినిమాల వివరాలేంటో చూద్దాం.

ఘరానామొగుడు:
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ ఘరానా మొగుడు. ఇందులో చిరంజీవి నవరస నటనను ప్రదర్శిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా నుంచి చిరంజీవి కొత్తగా కనిపించడం స్టాట్ చేశారు. అప్పటి వకు ఇండస్ట్రీలో ఉన్న గ్యాంగ్ లీడర్ రికార్డును ఘరానా మొగుడుతో బ్రేక్ చేశాడు. నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుంది. దేవీ వరప్రసాద్ నిర్మాణంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1992 బ్లాక్ బస్టర్ గా నిలచింది. కన్నడంలో వచ్చిన ఓ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. ఘరానా మొగుడు మొత్తం 55 కేంద్రాల్లో 50 రోజులు.. 39 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. అంతేకాకుండా ఆ కాలంలో రూ.10 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది.

చంటి:
వెంకటేశ్ జీవితంలోనే మైలురాయిగా నిలిచిన చిత్రం చంటి. ఇందులో వెంకటేశ్ నటనే హైలెట్ గా నిలుస్తుంది. అమాయక చక్రవర్తిలా వెంకటేశ్ ను చూసి ఇలా కూడా నటిస్తారా..? అని అనుకున్నారు. అప్పటి వరకు ‘బొబ్బిలి రాజా’ మూవీతో సక్సెస్ బాట కొనసాగిస్తున్న వెంకటేశ్ కు చంటి మంచి బూస్టు నిచ్చింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని కేఎస్ రామారావు నిర్మించారు. మీనా, నాజర్, తదితరులు ప్రధాన పాత్రలుగా నటించారు. ఇక ఇందులోని పాటలు ఇప్పటికీ అలరిస్తూ ఉంటాయి. చంటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఈ సినిమా 33 కేంద్రాల్లో వంద రోజులు నడిచి రూ.9 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది.

రౌడీ ఇన్ స్పెక్టర్:
బాలకృష్ణ పోలీస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న మూవీ రౌడి ఇన్ స్పెక్టర్. విజయశాంతి జోడీగా వచ్చిన ఈ సినిమాను బి గోపాల్ డైరెక్షన్ చేశారు. అప్పటికే లారీ డ్రైవర్ సక్సెస్ తో ఉన్న బాలయ్య మరోసారి విజయశాంతితో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా కూడా 1992 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రౌడీ ఇన్ స్పెక్టర్ 35 కేంద్రాల్లో వంద రోజులు నడిచి రూ.7 కోట్ల గ్రాస్ చేసింది.

Leave a Reply

Your email address will not be published.