కేజీఎఫ్ గనులు నిజమేనా .. ఆధిపత్యపోరు జరిగిందా? : కేజీఎఫ్ అసలు స్టోరీ ఇదే..

By | April 16, 2022

చాలా విషయాలు మనకు సినిమాల ద్వారానే తెలుస్తాయి. ప్రజల్లో చైతన్యం నింపేందుకు కొందరు కొన్ని విషయాలను తెరమీద ఉంచి ప్రదర్శిస్తారు. వ్యాపారం విషయాన్ని పక్కనబెట్టి సమాజంలో జరిగే విషయాలు ప్రజలకు తెలిపేందుకు సినిమాలను మార్గాలుగా ఎంచుకున్నవారు ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ సినిమాల ప్రాధాన్యత తగ్గుతుంది. విషయం ఉన్న సినిమాల కంటే అట్రాక్ట్ చేసే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల రిలీజైన కేజీఎప్ చాప్టర్ 2 సినిమాలోని స్టోరీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇందులో బంగారం కోసం గనుల తవ్వేందుకు కొందరిని తీవ్రంగా కష్టపెడుతుంటారు. వీరిలో ఓ యువకుడు ఎదురుతిరిగి ఆధిపత్యం కోసం పోరాటం చేస్తాడు. అయితే యథార్థ ఘటన ఆధారంగా అని చెప్పినా.. సినిమాలో చూపించిన సంఘటనలు జరిగాయా..? ఇదంతా నిజమేనా..? కల్పితాలు ఉన్నాయా..? అనేది తెలుసుకుందాం..

కేజీఎఫ్ అంటే కొలార్ గోల్డ్ ఫీల్డ్.. అంతే కొలార్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ప్రస్తుతం ఓ జిల్లా కేంద్రం. ఈ జిల్లాకు సమీపంలో బంగారం గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు.. బెంగుళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కొలార్ గనులు విస్తరించి ఉన్నాయి. ఇందులో బంగారం లభ్యమవుతుందన్న విషయం వాస్తవమే. కానీ సినిమాల్లో చూపించిన విధంగా ఆదిపత్య పోరు అనేది కల్పితమేనని కొందరు అంటున్నారు.

చరిత్ర ప్రకారం పరిశీలిస్తే సుమారు 100 ఏళ్లపాటు ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు జరిపారు. ఇక్కడ బంగారం అయిపోయిందని తెలుసుకున్న తరువాత 2001లో తవ్వకాలు నిలిపివేశారు. టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆ తరువాత మరణించాడు. దీంతో మైసూర్ ప్రాంతం బ్రిటిష్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో బ్రిటిష్ గవర్నర్ జాన్ వారెన్, కొలారం ప్రాంతంలో బంగారం ఉన్నట్లు కనుగొన్నాడు. ఈ విషయాన్ని ఓ పుస్తకంలో రాశాడు. ఆ తరువాత పరిసర ప్రాంతాల ప్రజలతో కలిసి అక్కడ తవ్వకాలు జరిపారు. అయితే అనుకున్నంత బంగారం లభ్యం కాకపోవడంతో తవ్వకాలు నిలిపివేశారు.

1850 తరువాత వారెన్ రాసిన పుస్తకాన్ని లావెల్లి అనే బ్రిటిష్ అధికారి చదివాడు. దీంతో కొన్ని రోజులకు జాన్ టేలర్ కంపెనీ చొరవతో కొలార్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలకు అవసరమైన విద్యుత్ కోసం ఓ ప్లాంటును నిర్మించారు. ఇలా ఇక్కడ 30 వేల మంది కార్మికులు తవ్వకాల్లో పాల్గొన్నారు. ఇలా 2001 వరకు తవ్వకాలు కొనసాగించారు. అయితే ఇక్కడ ఇక బంగారం లభ్యం కాదనే విషయం తెలుసుకున్నాక నిలిపివేశారు. అయితే సినిమాలో చూపించిన విధంగా ఆధిపత్య పోరు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని అంటుననారు. కానీ కొలార్ గనుల్లో మాత్రం బంగారాన్ని వెలికితీసినట్లు చరిత్ర చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published.