కేజీఎఫ్ చాప్టర్ 2 కు పనిచేసిన ఈయన గురించి తెలుసా..?

By | April 17, 2022

బంగారం గనుల నేపథ్యంలో వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 థియేటర్లో దద్దరిల్లుతోంది. యశ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ మూవీని ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. మాస్ ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా బాహుబలి రికార్డును సైతం బీట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో నటించిన వారికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోగా యశ్ తనదైన శైలిలో నటించాడు. రాకీ భాయ్ గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ఈ హీరో ఇంట్రడక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాకీబాయ్ సన్నివేశాలతో సినిమా దూసుకుపోతుంది. చాలా ఏళ్ల క్రితం వెండితెరపై నటించిన రవీనా టాండన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా సినిమా నటులకే కాకుండా టెక్నీషియన్స్ పేర్లు కూడా మారుమోగుతున్నాయి.

ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ప్రధాన పేర్లు ఒకటి ప్రశాంత్ నీల్ కాగా.. మరొకటి ఉజ్వల్ కులకర్ణి. కేజీఎఫ్ మొదటి సినిమా తరువాత ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా తరువాత పలువురు హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కేజీఎప్ చాప్టర్ 2తో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ మలచడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

ప్రశాంత్ నీల్ తో పాటు ఇప్పుడు మరో పేరు మారుమోగుతోంది. ఆయనే ఉజ్వల్ కులకర్షి. ఉజ్వల్ కులకర్ణి కేజీఎఫ్ చాప్టర్ 2 కు ఎడిటర్ గా పనిచేశాడు. ఒక సినిమాకు డైరెక్షన్ ఎంత ప్రధానమో.. ఎడిటింగ్ కూడా అంతే ప్రధానంగా ఉంటే సినిమా సెట్ అవుతుంది. అయితే ఉజ్వల్ కులకర్ణి పేరు మోసిన ఎడిటర్ కాదు. ఇప్పటి వరకు యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ తీసిన ఆయన ఏకంగా పెద్ద సినిమాకే ఎడిటర్ గా చాన్స్ కొట్టేశాడు. 19 ఏళ్ల వయసున్న ఉజ్వల్ తీసిన వీడియోలను చూసిన ప్రశాంత్ నీల్ ఆయన వీడియోల్లోని ఎడిటింగ్ బాగా నచ్చిందట. దీంతో ఆయనకు పెద్ద బాధ్యతను అప్పగించాడు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఉజ్వల్ కులకర్ణి పేరు మారుమోగుతోంది. అతి చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్టులో పనిచేసిన ఆయన ప్రతిభను చూసి మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఆయనను కొన్ని సినిమాల్లో పనిచేయించుకోవాలని అనుకుంటున్నారట. అయితే ప్రశాంత్ నీల్ ఈ ఒక్క సినిమాతో స్టార్ ఎడిటర్ గా మారినా ఆ తరువాత మరే సినిమాకు పనిచేస్తాడో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published.