ఎన్టీఆర్ సినిమాకు బడ్జెట్ పెంచేసిన కొరటాల శివ..

By | April 18, 2022

నందమూరి వంశం నుంచి సినీ రంగంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు మొదట్లో కొన్ని కష్టాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అధిగమించుకొని విజేతగా నిలిచాడు. మిగతా వారికంటే హార్డ్ వర్క్ ఎక్కువగా చేసే జూనియర్ యాక్టింగ్లో డిఫరెంట్ గా కనిపిస్తాడు. పాత్ర ఎలాంటిదైనా అందులో ఇమిడిపోయే ఈ యంగ్ టైగర్ సినిమాల కోసం ఎదురుచూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. బాల్యంలోనే సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన చదువు పూర్తయ్యాక హీరోగా మారాడు. ఆ తరువాత స్టార్ హీరో అయ్యాడు. మొత్తంగా ఇప్పుడున్న టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ప్రత్యేకమైనవే. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పేరు తెచ్చుకున్నాడు.

‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కు మొదట్లో కలిసి రాలేదు. అయినా ఆయన సినీ పయనం ఆగలేదు. డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ గిప్ట్ తో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ఆది అనే సినిమాలో నటించి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా వరుసగా మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ చిత్రాల్లో అలరించాడు. ఇక ‘అదుర్స్’ లాంటి కామెడీ చిత్రాల్లోనూ తన ప్రతిభను నిరూపించాడు. ఇలా పాత్ర ఏదైనా దానికి అందాన్ని తెచ్చే ఎన్టీఆర్ తో సినిమాలు తీయాలని కొందరు డైరెక్టర్లు క్యూ కడుతుంటారు.

అందుకే ఆయన ఇప్పుడు చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా మారాడు. రాజమౌళితో నాలుగో సినిమా చేసిన ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కొమురం భీం పాత్రలో లీనమైపోయి ఆ పోరాట వీరుడిని గుర్తు తెచ్చాడు. ఈ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్ కు భారీ పారితోషకి అందినా.. అందుకు తగ్గట్టుగా సినిమాకు న్యాయం చేశాడు. దాదాపు 500 కోట్లతో నిర్మీతమైన ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్ల వసూళ్లతో రికార్డులు కొడుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ నటన చూసి కొందరు ఇరత భాషా డైరెక్టర్లు తనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో త్వరలో కొరటాల డైరెక్షన్లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టేఅవకాశాలున్నాయిన జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఎన్టీఆర్ సాధారణ బడ్జెట్ సినిమాలు చేసినా.. ఇప్పుడు ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తేనే ఫలితం ఉంటుందని డైరెక్టర్లు భావిస్తున్నారు. అందుకే కొరటాల శివ తాను తీయబోయే సినిమాకు ఏమాత్రంత తగ్గకుండా రూ. 300 కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.