వడ్డే నవీన్ ప్రేమ పెళ్లిని జూనియర్ ఎన్టీఆర్ చేశారా..? ఆ తరువాత..?

By | April 19, 2022

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది బంధువులుగా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారితోనే బంధుత్వం కలుపుకున్నారు. వీరిలో వడ్డే నవీన్ ఒకరు. వడ్డే నవీన్ గురించి నేటి తరం వారికి పెద్దగా పరిచయం లేదు గానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఆయన మొదట్లో లవ్ సినిమాలు ఎక్కువగా చేసేవారు. లవ్ సినిమాల తరువాత ఫ్యామిలీ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తండ్రి, నిర్మాత వడ్డే రమేశ్ ప్రొద్భలంతో ఇండస్ట్రీలోకి వచ్చినా.. వడ్డే నవీన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వడ్డే నవీన్ ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఒకరిగా ఉండేవారు. అంతేకాకుండా ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ కు వరుసకు బావ అవుతాడు..

సీనియర్ ఎన్టీఆర్ హయంలో సినీ పరిశ్రమ స్వర్ణ యుగంలా గడిచిందంటారు. ప్రతిభ ఉన్న ప్రతీ వ్యక్తి సినిమాల్లో రాణించేవారంటారు. అంతేకాకుండా రామారావు కొందరు టెక్నీషియన్లను కూడా ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో వడ్డే రమేశ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎదిగారు. ఆ తరువాత తన కుమారుడిని సినీ ఇండస్ట్రీలోకి తెచ్చారు. ఈ క్రమంలో వడ్డే నవీన్ స్టార్ హీరో అయ్యాక ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి నందమూరి ఫ్యామిలికి చెందిన వారు కావడం విశేషం. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వరి, వడ్డే నవీన్ ప్రేమలో పడ్డారు.

అయితే ఆ తరువాత వీరి విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వీరి సంబంధాన్ని కుదిర్చారని వార్తలు వచ్చాయి. మొత్తానికి వడ్డే నవీన్, చాముండేశ్వరిలు పెళ్లి చేసుకున్నారు. దీంతో వడ్డే నవీన్ ఎన్టీఆర్ కు బావ అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. మరోవైపు నవీన్ కు కూడా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఎంత శ్రమించినా అవకాశాలు దక్కకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేశాడు. కానీ అక్కడ కూడా అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో సినిమాలు చేయడం మానేశాడు.

కానీ ఆయన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బాబు కూడా జన్మించాడు. ఇటీవల వడ్డే నవీన్ తన కొడుకుతో కలిసిన ఉన్న ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దాదాపు 28 సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ సినిమాల్లో చాలా వరకుసక్సెస్ అయినవే ఉన్నాయి. కానీ ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఇమడలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.