నేపాల్లో బంగారు తాబేలు జననం..: బ్రహ్మంగారు ముందే చెప్పారా..?

By | April 20, 2022

తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండ్ నందమూరి తారకరామారావు మనమధ్య లేకున్నా.. ఆయన విశేషాలు మాత్రం కళ్లముందే కదలాడుతున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఎన్నో విశేషాలు నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాల్లో చేసిన యాక్టింగ్ ను కొందరు ఇప్పటి వారు ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆయన పేరుతో చాలా మంచి సినిమాలు కూడా తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా మెప్పించాడు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ ‘పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్షానం’. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు ప్రధాన నటుడిగా ఈ సినిమాలో కనిపించాడు. అంతేకాకుండా నిజమైన పోతులూరి వీరబ్రహ్మం రాసిన కథలను ఆయన సినిమా ద్వారా చెప్పారు. భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో కాలజ్జానం ద్వారా చెబుతాడు. అయితే ఆయన చెప్పిన కొన్ని విషయాలు జరుగుతున్నాయని ఆధ్యాత్మిక వాదులు అంటుండగా.. ప్రకృతిలో ఇవన్నీ సహజమేనని సైంటిస్టులు అంటున్నారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ప్రకారం.. కాలం కిందిమీదవుతుందని.. మహిళలు పురుషుల దుస్తులు ధరిస్తారని.. దేశాన్ని ఓ మహిళ పాలిస్తుందని ఉంది. అలాగే ఈశాన్యంలో ఓ పురుగు పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తుందని, ఆ తరువాత ప్రజలు చాలా మంది చనిపోతారని చెప్పారు. అయితే ఆయన చెప్పిన ప్రకారమే కరోనా చైనాలో పుట్టిందని అంటున్నారు. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయని, ఇదికూడా జరిగిందని అంటున్నారు. అయితే బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో మరొకటి ఉంది. ఈశాన్యంలో బంగారు తాబేలు పుడుతుందని, ఆ తరువాత అనేక పరిణమాలు చోటు చేసుకుంటాయని చెబుతారు.

అయితే ఇటీవల నేపాల్ లో బంగారు వర్ణం కలిగిన ఓ తాబేలు జన్మించింది. ఈ దేశంలో తాబేలును దేవుడిగా భావిస్తారు. దీంతో ఈ తాబేలు తమకు దైవ రూపం అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు పోతలూరి వీర బ్రహ్మంగారు చెప్పిన విధంగానే జరుగుతుందని అంటున్నారు. కాని కొందరు మాత్రం జన్యులోపంగా ఆ తాబేలు జన్మించిందని, ఇది పెద్ద వింతేమి కాదని కొట్టిపారేస్తున్నారు. కానీ నేపాలీలు మాత్రం ఈ వాదనను పట్టించుకోవడం లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఫ్యూచర్లో జరగబోతాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.