ఇలా చేస్తే మీ దరిద్రాలన్నీ మాయం..

By | April 20, 2022

జీవితంలో కొందరిని నిత్యం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ కష్టాలను తొలగించుకునేందుకు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవు. అయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వల్ల ఒక కుటుంబంలో సమస్యలు వస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు. నెగెటివ్ ఎనర్జీని కనుగ పోగొడితే మనకు దాదాపు ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటిలో ముఖ్యంగా గోమాతను పూజించడం. హిందువుల్లో ఉన్న ఆచారాల ప్రకారం గోమాతను దేవతగా భావిస్తారు. ఎందరో దేవతలు గోవులో ఉంటారని, గోమాతను పూజిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని అంటున్నారు. అయితే గోమాతను ఎలా పూజించాలో ఒకసారి చూద్దాం..

దైవానుగ్రహం కోసం కొందరు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయినా కూడా తినడానికి ఆహారం దొరకకపోవడం, వైభవంగా డబ్బు రాకపోవడం, చేసే పని సక్సస్ కాకపోవడం లాంటివి సంభవిస్తుంటాయి. అయితే వీటిని అష్టదరిద్రాలంటారు. ఏ పనిచేసినా అందులో ప్రతికూల పరిస్థితులు రావడంతో మనుషులు తీవ్ర నిరాశ చెందుతారు. అంతేకాకుండా తమ జీవితం ఇక ముగిసిందని భావిస్తారు. అయితే సాధారణంగా కాకుండా గోవును ఇలా పూజిస్తే కాస్త ఫలితం ఉంటుందని అంటున్నారు.

గోమాతకు ఆహారం తినిపించడం వల్ల శుభఫలితాలు వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా లింగాష్టకం, దారిద్ర దహన స్తోత్రం జరిపించడం వల్ల అష్ట దరిద్రాలు దూరమవుతాయని అంటున్నారు. అయితే ఇక్కడ గోమాత తోకను కూడా పూజ చేయాలని కొందరు చెబుతున్నారు. గోమాత తోక కూడా అష్ట దరిద్రాలను సులభంగా దూరం చేస్తుందని అంటున్నారు. మన పురాణాల ప్రకారం గోమాతలో మాత్రమే అందరూ దేవతలు ఉంటారు. అందువల్ల గోమాతను పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

గోమాతకు ఆహార పదార్థాలు తినిపించడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులున్నవారు గోమాత తోకను తాకాలంటున్నారు. ఇక గోమాత తోకలో ఉండే వెంట్రుకను తీసుకొని కాలిబొటని వేలుకు కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలుంటాయని అంటు్నారు. దారం కట్టిన ఆ కాలిబొటన వేలిని శరీరంలో నొప్పి ఉన్నచోట ఉంచితే నయమవుతుందట. గోవు తోకలోని వెంట్రుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్ట దరిద్రాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.