ఎన్టీఆర్ లవకుశ రికార్డుల గురించి తెలిస్తే మైండ్ బ్లాకవుద్ది..

By | April 20, 2022

అలనాటి మేటీ హీరో నందమూరి తారకరామారావు సినిమాలంటే ఇప్పటికీ చూడని వారుండగరు. నటకీర్తీగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు దాదాపు విజయవంతం అయ్యేవి. ఇక పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలు మెమరీస్ గా ఉండిపోయాయి. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి వినోదాన్ని పంచాడు.

ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో లవకుశ సినిమా ఎవర్ గ్రీన్ గా ఉండిపోయింది. ఈ సినిమాలో నందమూరి చెప్పే డైలాగ్ లు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. సీత పాత్రలో అంజలీ దేవి నటించారు. లవకుశలుగా ఇద్దరు బాల నటులు చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజై ఆకట్టుకుంది. ఆరోజల్లో ఈ సినిమా పెద్ద సంచలనంగా మారింది.

అయితే ఈ సినిమా సినీ చరిత్రలో రికార్డు సాధించింది. అప్పటికీ.. ఇప్పటీకీ ఏ సినిమా ఆడని విధంగా ఏకంగా 500 రోజులు ప్రదర్శింపబడింది. అంతకుముందు ఈ ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి 245 రోజులు నడిచింది. ఆ తరువాత ఆ రికార్డును ఎన్టీఆర్ లవకుశతో బ్రేక్ చేశాడు. ఆ రోజుల్లో ఇన్ని రోజులు నడిడి రూ.కోటి రూపాయల వరకు వసూళ్లు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ లవకుశ రికార్డు రాసింది. అక్కడ ఏకంగా 40 వారాలు ప్రదర్శించారు. హిందీలో 25 వారాలు నడిచి దుమ్ము లేపింది.

అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన లవకుశ సినిమా తొలి తెలుగు కలర్ సినిమా కావడం విశేషం. ఇందులో లక్హణ్ గా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రఘ్ణుడిగా శోభన్ బాబు, లవుడుగా నాగబాబు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. 1963లో మార్చి 29న విడుదలైన ఈ సినిమా ను చూసేందుకు ఎడ్లబండ్లపై థియేటర్లకు వేళ్లేవాళ్లమని కొందరు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.