ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

By | April 20, 2022

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్య నటనతో అశేషన ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పటికీ హీరోగా నటిస్తూ అలరిస్తున్నాడు. ఓవైపు కొడుకు స్టార్ హీరో అయినా.. ఆయనతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. మూడు తరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న చిరు ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సినీ ప్రేక్షకుల్లో ఆయనపై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అలనాటి సినిమాల్లో చిరు నటన చూసి యూత్ షాకయ్యేవారు. ఇక ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఇంట్రెస్టు చూపేవారు. ఒక్కసారి చిరంజీవితో సినిమా చేస్తే పాపులారిటీ వస్తుందన్న నమ్మకం చాలా మందిలో ఉండేది. అలా తెలుగు హీరోయిన్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చిరుతో నటించాలని అనుకునేవారు.

బెంగాల్ రాష్ట్రానికి చెందిన నగ్మా, చిరులు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఘరానా మొగుడు, రిక్షావోడు సినిమాలు బంపర్ హిట్టు కొట్టాయి. అయితే నగ్మాకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వీరిలో ఒకరు జ్యోతిక కాగా.. మరొకరు రోషిణి. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లతో చిరు నటించి అలరింపజేశారు. వీరిలో నగ్మాతో చేసిన సినిమాల గురించి చాలా మందికి తెలుసు. అలాగే జ్యోతికతో కలిసి ఠాగూర్ సినిమాలో చేశారు. ఈ సినిమాలో జ్యోతిక గెస్ట్ రోల్ అయినా చాల చక్కగా నటించారు. ఆ కొద్దిసేపు చాలా వినోదాన్ని పంచారు.

ఇక నగ్మా మూడో చెల్లెలు రోషిణి గురించి చెప్పుకోవాలంటే.. ఈమె కూడా చిరుతో నటించారు. ఆమె ఎవరో కాదు.. మాస్టర్ సినిమాలోని ప్లాష్ బ్యాక్ లో కనిపించే హీరోయిన్. తెలుగు సినిమాల్లో చిరంజీవితో నటించిన రోషిణి మళ్లీ కనిపించలేదు. అయితే ఈ సినిమాలోనూ రోషిణి గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. అయితే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండేది. ఆ సినిమా తరువాత రోషిణి మళ్లీ సినిమాల్లో అలరిస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ కనిపించలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో రోషిణి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆలా నగ్మాతో పాటు ఆమె చెల్లెల్లిద్దరూ కలిసి చిరంజీవితో నటించి ఆకట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.