తలపై ఇలా స్వస్తిక్ గుర్తు ఎందుకు రాస్తారు..?

By | April 20, 2022

హిందూ సాంప్రయదాయం ప్రకారం ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కొన్ని శుభకార్యాలను పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అలాగే పురాతన కాలంగా వస్తున్న సాంప్రదాయలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. హిందువుల్లో పుట్టిన ప్రతి బిడ్డకు మొదటిసారి తల వెంట్రుకలను దేవుడికి సమర్పిస్తారు. పుట్టు వెంట్రుకలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పండుగ చేసుకుంటారు. పుట్టు వెంట్రుకలను తన మేనమామ లేదా తాతయ్య ద్వారా తీసి వాటిని ఇలవేల్పుకు సమర్పిస్తారు. అయితే పుట్టు వెంట్రుకలు తీసిన తరువాత గుండుకు కొందరు గంధంతో స్వస్తిక్ గుర్తును రాస్తారు. ఇలా ఎందుకు రాస్తారు..? ఇలా రాయడానికి కారణమేంటి..?

స్వస్తిక్ గుర్తు అంటే వినాయకుడు, సూర్యునికి ప్రతిబింబంగా భావిస్తారు. మనం చేసే ప్రతీ పూజకు ముందు వినాయకుడి ఆరాధిస్తాం. గణనాథునికి పూజా విధానాలు చేసిన తరువాతే మిగతా దేవుళ్లను ఆరాధిస్తాం. అలా పాప లేదా బాబుకు పట్టు వెంట్రుకలు మొదటిసారి తీస్తున్నందున ఆ వెంట్రుకలు తమ ఇష్టదైవానికి సమర్పించి ఆ చిన్నారి తలపై గంధంతో స్వస్తిక్ నామం రాస్తారు. అయితే గంధం పెట్టడం వల్ల తలకు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే చిన్న పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల గంధాన్ని గుండుకు రాస్తారు.

ఇక చిన్నారి భవిష్యత్ బాగుండాలని స్వస్తిక్ గుర్తు రాస్తారు. ఇలా రాయడం వల్ల తన జీవితంలో దైవం తోడుండాలని కోరుకుంటారు. ఇలా స్వస్తిక్ గీసిన ఆరు నెలల తరువాత శిశువునకు అన్నప్రసాన చేస్తారు. ఆ తరువాత సరిగ్గా ఏడాదికి శిశువుకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. పుట్టు వెంట్రుకలే కాకుండా ప్రతీ శుభకార్యంలోనూ మొదటగా స్వస్తిక్ గుర్తు రాస్తారు. మనం ఎక్కువగా గృహ ప్రవేశాల్లోనూ, షాపు ప్రారంభంలోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఇలా రాయడం వల్ల భవిష్యత్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటాటర.

Leave a Reply

Your email address will not be published.