హిరోయిన్ గా కొనసాగి కనుమరుగైన భామలు వీళ్లే..

By | April 20, 2022

సినిమాల్లో అవకాశాలు దొరకడం చాలా కష్టం. కానీ వచ్చిన అవకాశాలన్ని వినియోగించుకుంటూ కొందరు ఏ పాత్ర వచ్చినా చేయడానికి రెడీ అవుతారు. అయితే ఎంత కష్టపడినా కొందరు సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేకపోతారు. కొన్ని రోజుల పాటు అలరించి ఆ తరువాత కనుమరుగై పోతారు. ఇండస్ట్రీలోకి కొత్త నటులు రావడంతో వారి హవా తగ్గుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు తమ అందచందాలతో ఆకట్టుకున్న భామలు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. అయితే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో..? ఎక్కడున్నారో..? ఎవరికీ తెలియదు. కానీ అలా కొన్ని సినిమాల్లో అలరించి ఆ తరువా దూరమైన వారి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

రీమాసేన్:
తమిళ, మలయాళం నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రీమాసేన్ ఆ తరువాత మనసంతా నువ్వే సినిమాతో చాలా ఫేమస్ అయింది. ఆ తరువాత పవన్ కల్యాణ్ తో కలిసి బంగారం సినిమాలో నటించినా ఆమ్మడుకు గుర్తింపు లేకుండా పోయింది. ప్రస్తుతం సినిమాలు మానుకున్నట్లు సమాచారం.

గజాలా:
‘నాలో ఉన్న ప్రేమ’ సినిమాతో అందంగా కనిపించిన గజాలా స్టార్ హీరోలతో కలిసి నటించించి. కానీ ఆమెకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో స్టార్ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించిన గజాలా ఒక్కసారిగా కనుమరుగై పోయింది. మళ్లీ సినిమాల్లో కనిపించడ లేదు.

అన్షు:
అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ ‘మన్మథుడు’ సినిమాలో మెరిసింది అన్షు. ఈ సినిమాలో కొద్దిసేపే కనపించిన తన ఆందంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తరువాత ప్రభాస్ తో కలిసి రాఘవేంద్ర సినిమాలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమ్మడు అంతటితో తెలుగులో మల్లీ కనపించలేదు.

కమలిని ముఖర్జీ:
శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న కమలిని తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ అనుకున్న స్టార్ గుర్తింపు రాలేదు. ఆ తరువాత సైడ్ రోల్స్ చేసినా రాణించలేదు. దీంతోప్రస్తతం ఇండస్ట్రీలో కనిపించడం లేదు.

రక్షిత:
రవితేజ నటించిన ‘ఇడియట్’ అనే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన రక్షిత ఆ తరువా ఆమె గ్రాఫ్ తగ్గింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసినా ఈ భామకు క్రేజ్ దక్కలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ట్రై చేసింది. అక్కడా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో సినిమాలు చేయడం మానుకుంది.

ఆశిమా భల్లా:
మొదటి సినిమా ‘డాడీ’తో మెగాస్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆషిమా భల్లా. ఆ తరువాత వేణుతో కలిసి చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాలు చేయడం మానేసింది.

Leave a Reply

Your email address will not be published.