పుష్ఫ ‘కత్తి’కథ ఇదే…: అసలేం జరిగిందంటే..?

By | April 23, 2022

సర్ ఫ్రైజ్ ఇస్తానని చెప్పిన యువతి కాబోయే భర్త మెడను కోసిన ఉదంత తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు అమ్మాయిలే అబ్బాయిల దాడులు చూశాం.. కానీ మొదటి సారి తనకు కాబోయే భర్తను అంతమొందించాలని పకడ్బందీ ప్లాన్ తో కత్తితో దాడి చేసిన పుష్ప గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.సాధారంగా కాబోయే భార్య పిలిస్తే ఎక్కడికైనా వెళ్తారు. పుష్పకు కాబోయే భర్త రాము నాయుడు కూడా ఇదే తరహాలో తనతో ఓ కొండపైకి వెళ్లాడు. కానీ పుష్ప మాత్రం అతనికి గిఫ్ట్ గా దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తూ రాము నాయుడు ప్రాణాలకే ప్రమాదం లేదు. కానీ పెళ్లి చేసుకోబోయే పుష్ప మాత్రం సెంట్రల్ జైలుకు వెళ్లింది. ఇంతకీ పుష్ప దాడి చేయబోయే ముందు ఏం చేసింది….? కత్తిని ఎక్కడ కొనుగోలు చేసింది..?

అనకాపల్లి మండలంలోని రావికమతం కు చెందిన పుష్ప కు మాడుగుల ఘాట్ రోడ్ ప్రాంతానికి చెందిన రాము నాయుడుతో ఈనెల 4న పెళ్లి ఫిక్సయింది. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే పుష్పకు రాము నాయుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో అతడిని అంతమొందించాలని అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రాము నాయుడుతో సరదాగా మాటలు కొనసాగిస్తున్న పుష్ప ఒకసారి తను చెప్పిన రోటుకు రావాలని కోరింది పుష్ప. దీంతో కాబోయే భార్య పిలిచినప్పుడు ఇతర మొగాళ్లలాగే రాము నాయుడు కూడా ఉత్సాహంగా వెళ్లాడు. అయితే రాముతో కలిసి ఓ కొండపైకి వెళ్లాలను అనుకుంది. ఈ విషయాన్ని రాముతో చెప్పడంతో ఓకే చెప్పింది.

పుష్ప ఇంటికి వచ్చిన రాము నాయుడు ఇద్దరు కలిసి తన ఇంట్లో భోజనం చేశారు. ఆ తరువాత 12 గంటలకు బండిపై బయటకు వెళ్లారు. అయితే మార్గమధ్యంలో ఓ షాపు వద్ద పుష్ప ఆగింది. అయితే పుష్ప ఏ వస్తువు కొనుగోలు చేస్తుందోనని అనుకున్నాడు. కానీ పుష్ప మాత్రం ఆ షాపులోకి వెళ్లి కత్తిని కొనుగోలు చేసింది. పసుపు పిడి ఉన్న కత్తికి రూ.20 చెల్లించింది. ఆ తరువాత ఇద్దరు కలిసి ఓ కొండపైకి వెళ్లారు. అప్పటికీ పుష్పపై రామును అనుమానం రాలేదు. కానీ పుష్ప మాత్రం జాగ్రత్తగా కత్తిని కనిపించకుండా తన వద్దే ఉంచుకుంది.

కొండపైకి వచ్చిన తరువాత కాసేపు రాముతో మాట్లాడిన పుష్ప తనతో సెల్ఫీ తీసుకుంది. ఆ తరువాత తనకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి కళ్లు మూసుకోమ్మంది. దీంతో పుష్ప మాటలు నమ్మిన రాము నాయుడు కళ్లు మూసుకున్నాడు. దీంతో తనతో తెచ్చుకున్న కత్తితో రాము మెడను కోసేసింది. అయితే రాము గోంతు కోసిన తరువాత పుష్ప భయపడింది. అయితే రాము తేరుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. లేకుంటే అక్కడే ప్రాణాలు పోయేవి. ఇక పుష్ప మాత్రం సెంట్రల్ జైలులో జీవితాన్ని గడుపుతోంది.

Leave a Reply

Your email address will not be published.