Kajal : కాజల్ తన కుమారుడికి ఏం పేరు పెట్టారో తెలుసా..?

By | April 23, 2022

టాలీవుడ్లో కొన్ని సంవత్సరాలపాటు తన అందచందాలతో ఆకట్టుకున్న భామల్లో కాజల్ ఒకరు. పెద్ద పెద్ద కళ్లు.. చక్కటి చిరునవ్వుతో ఆకట్టుకునే ఈ భామ ‘చందమామ’ సినిమాతో ఫేమస్ అయింది. ఈ తరువాత అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. అయితే కాజల్ ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది.పెళ్లయిన తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో నటించింది.

నాగార్జునతో కలిసి ‘ఘోస్ట్’ సినిమాలకు సైన్ చేసిన అమ్మడు అప్పటికే గర్భవతి అయింది. దీంతో ఆ సినిమా నుంచి తప్పించింది. ఇక కాజల్ ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వం పొందడంలో ఉన్న అనుభూతి చెప్పలేదని కాజల్ ఇటీవల కామెంట్స్ చేసింది. అయితే తన బిడ్డకు ఓ పేరు పెట్టాలని కాజల్ ఇప్పుడే నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. ఇంతకీ కాజల్ తన కుమారుడికి ఏం పేరు పెట్టాలనుకున్నారో చూద్దాం..

సినిమాల్లో సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన కాజల్ 2020 సంవత్సరంలో అక్టోబర్ 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. కొవిడ్ కారణంగా అతికొద్ది మంది మధ్యలో వివాహం చేసుకున్న తరువాత కాజల్ సినిమాలను చేయడం తగ్గించింది. హీరోయిన్ కాకుండా డిఫరెంట్ రోల్ లో నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే కాజల్ ఈ నెల 19న ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ముంబయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే తన కుమారుడికి ఏం పేరు పెట్టాలనుకుంటారన్ని కొందరు అభిమానులు కాజల్ ను అడిగారు.

దీంతో తన పేరును కాజల్ అప్పుడే డిసైడ్ చేసేసింది. తన ముద్దుల కొడుకుకు నీల్ కిచ్లు అనే పేరను ఖరారు చేసినట్లు తెలిపింది. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు కాజల్ దంపతులకు విషేష్ చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో వరుస ఫోటోషూట్స్, ప్రకటనలతో బిజీగా నడిపిన కాజ్ ఇప్పుడు తన కుమారుడిని చూస్తూ మురిపిసోతుంది.

Leave a Reply

Your email address will not be published.