ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూబ్ కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

By | April 24, 2022

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లో రిలీజై నెల రోజులు గడుస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే 1100 కోట్లు దాటిన వసూళ్లూ ఇంకా వస్తుండడం విశేషం. అటు మరో భారీ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 పోటీని తట్టుకొని ఆర్ఆర్ఆర్ సినిమా కొనసాగుతుండడం చూస్తే ఈ సినిమా రికార్డును కేజీఎఫ్ 2 బీట్ చేస్తుందా..? అనే చర్చ సాగుతోంది. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇరు స్టార్లను సమానంగా చూపించిన జక్కన్న ఎన్టీఆర్ కు కొంచె ఫీట్లను ఎక్కువ పెట్టారు. అయితే చాలా క్లిష్టమైన సీన్లలో ఎన్టీఆర్ కు డూబ్ గా ఓ వ్యక్తి నటించారు. అతని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. అంతేకాకుండా అతనికి ఇచ్చారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ కు డూబ్ గా నటించిన వ్యక్తి పేరు ఇమ్రాన్. ఎన్టీఆర్ డూబ్ గా కొన్ని సీన్లలో ఈయన నటించారు. అలా నటించినందుకు ఇమ్రాన్ కు రూ.2 లక్షలు ఇచ్చారట. అయితే ఎన్టఆర్ కు డూబ్ గా నటించినా ఏమాత్రం గుర్తుపట్టకుండా కవర్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తోపాటు ఎన్టీఆర్ కూడా చాల కష్టపడ్డాడు. కొన్ని సీన్లను సాహాసానికి మించి చేశారు. అయితే మరీ క్లిష్టమైన సీన్లలో మాత్రం డూబ్ ను పెట్టాల్సి వచ్చింది. ఏదీ ఏమైనా ట్రిపుల్ ఆర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇక 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. అయితే జూన్ 3న ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ థియేటర్లలో ప్రభంజనం ఇలాగే కొనసాగితే ఓటీటీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కావాల్సి ఉండగా థియేటర్లలో హవా తగ్గకపోవడంతో ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేశారు. ట్రిపుల్ ఆర్ సక్సెస్ జోష్ లో ఉన్న రాజమౌళి నెక్ట్స్ మహేశ్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమాకు బడ్జెట్ మరింత పెరగనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.