మన స్టార్ హీరోలకున్న బ్యాడ్ హాబిట్స్ ఏంటో తెలుసా..?

By | April 24, 2022

ఒక వ్యక్తికి మంచి, చెడు అలవాట్లు రెండూ ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండూ ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా సినిమాల్లో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తరువాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలెవరో చూద్దాం..

విజయ్ దేవరకొండ:
‘గీతగోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్ ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇతనికి వాస్తవానికి సిగరెట్ తాగే అలవాటు లేదు. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో సిగరెట్ తాగాల్సి వచ్చింది.

అల్లు అర్జున్:
మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇతనికి కూడా ఎలాంటి బ్యాడ్ అలవాటు లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన బన్నీ ప్రస్తుతం పుష్ఫ 2 సినిమాతో బిజీగా మారాడు. ఇతను కూడా ‘సన్నాఫ్ సూర్య’సినిమాలో సిగరెట్ స్మోకింగ్ చేయాల్సి వచ్చింది.

మహేశ్ బాబు:
టాలీవుడ్ క్యూట్ బాయ్ గా పేరున్న మహేశ్ బాబుకు సిగరేట్ తాగే అలవాటు ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చిన తరువాత స్మోకింగ్ చేయడం మానేశాడు. ప్రస్తుతం కంప్లీట్ గా స్మోకింగ్ చేయడం లేదు.

విజయ్:
సౌత్ ఇండియన్ టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్ కు ఓ బ్యాడ్ అలవాటు ఉంది. ఖరీదైన కార్లు ఉన్న విజయ్ రాష్ డ్రైవింగ్ చేస్తాడన్న పేరు ఉంది. అంతేకాకుండా డ్రైవింగ్ విషయంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.

ధనుష్:
తమిళంతో పాటు తెలుగు, హిందీ ఇండస్ట్రీలకు పరిచయం అయిన ధనుష్ కు వాస్తవానికి శాఖాహారి. కానీ విదేశాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

సూర్య:
సౌత్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్న సూర్యకు ఓ బ్యాడ్ హాబిట్ ఉంది. అది డ్రెస్సులు మార్చడం. ఎక్కడికి వెళ్లినా కనీసం 10 రకాల డ్రెస్సులను మార్చేస్తాడట.

రజనీకాంత్:
ఇండియాలోనే ఫేమస్ యాక్టర్ రజనీకాంత్ గురించి తెలియని వారుండరు. ఈయనకు సిగరెట్ తాగడం పెద్ద బ్యాడ్ హాబిట్ ఉంది. దీనిని ఇప్పటికీ మానలేకపోతున్నాడట.

Leave a Reply

Your email address will not be published.