దేశ ద్రోహం కింద.. భర్తతో కలిసి మాజీ హీరోయిన్ అరెస్ట్..!!

By | April 25, 2022

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు హీరోయిన్ గా అలరించింది నవనీత్ కౌర్. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ నాయకురాలిగా మారిన నవనీత్ కౌర్ ను ..తన భర్తను అరెస్టు చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్టు చేశారు ఆమెను, ఆమె భర్తను అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ లో పుట్టి పెరిగిన నవనీత్ కౌర్ దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు దక్కాయి.

దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు ఆమె తెలుగులో వరుస సినిమాలలో నటించింది. అయితే ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ రావడంతో.. ఆ తర్వాత తమిళం, మలయాళం వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది. ఆ తరువాత రూమ్మేట్స్, మహారధి, జాబిలమ్మ, ఫ్లాష్ న్యూస్ వంటి సినిమాలలో నటించింది. అయితే ఇలా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు అంతగా కలిసి రాలేదు. అయితే యమదొంగ సినిమాలో రంభగా పాటలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. అయినా కూడా ఈమెకు అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసి రాజకీయ నాయకుడైన ఎమ్ ఎల్ ఏ రవి రానా ను ప్రేమించి వివాహం చేసుకుంది.

ఇక తన భర్త ప్రోత్సాహంతోనే ఈమె మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి 2019లో ఎన్నికలలో పోటీ చేసింది. దీంతో ఎమ్మెల్యే గా గెలిచింది. ముంబైలో హనుమాన్ చాలీసా పారాయణం విషయంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎంపీ నవనీత్ రానా మరియు ఆమె భర్త రవి రానాను ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేయడం జరిగింది. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని అనడం తో వారిని అరెస్టు చేసి ఆదివారం బాంద్రా కోర్టులో హాజరు పరిచారు. ఇక వీరిద్దరిని మే 6 వరకు జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ పైన ఏప్రిల్ 29న విచారణ ఉంటుందని తెలిపారు. వీరి మీద ఐ సి సి సెక్షన్ -124 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ప్రభుత్వం చేపట్టిన ఈ పని మీద తమ ప్రకటనల ద్వారా మతం, కులాల ప్రతిపాదకులు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.