అలనాటి హీరోయిన్ మీనా తల్లి కాబోతుందా.. అసలు విషయం ఏమిటంటే..?

By | April 25, 2022

అందాల తార హీరోయిన్ మీనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు బ్యూటిఫుల్ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా.. జపాన్లో కూడా స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది అంటే ఇక ఆమె క్రేజ్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీనా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం తమిళ్ వంటి ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మంచి అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఒకప్పుడు సినిమాలలో తన నటనతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మీనా ప్రస్తుతం వయసు పైబడటం తో చాలా సైలెంట్ అయిపోయింది అని చెప్పవచ్చు.

ఇక వైద్య రంగంలో రాణిస్తున్న సాగర్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది ఇదిలా ఉండగా వీరికి ఒక కూతురు జన్మించింది. ఇక అమ్మాయి పేరు నైనిక. ఈ చిన్నారి కూడా ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే మీనా పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించడం బాగా తగ్గిన చేసిందని చెప్పవచ్చు కానీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి అక్క చెల్లి అమ్మ వదిన తదితర పాత్రలు పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో మీనా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ వస్తోంది. అంతే కాదు అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గర వుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మీనా షేర్ చేసిన ఫోటోలో చీర కట్టుకున్న తర్వాత మేనేజ్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చాలా సున్నితంగా తెలిపింది.

ఇక అంతే కాదు ఇందులో మీనా కొంచెం బరువు పెరిగినట్లుగా కనిపించడంతో కొందరు ఏకంగా నటి మీనా మళ్ళీ తల్లి కాబోతుందని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు , వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.. కానీ కేవలం ఆమె లావుగా ఉండడం వల్లే పొట్ట ముందుకు వచ్చింది. కాబట్టి ఇలా కనిపిస్తోందని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపుకోండి అని మరికొంత మంది నెటిజన్లు మిగతా వాళ్లకు చెప్పడం గమనార్హం. ఇకపోతే మీనా తాజాగా రౌడీ బేబీ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.