సింగం హరి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

By | April 25, 2022

హరి గోపాల్ కృష్ణన్ నాడార్.. సౌతిండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన ఈయన హరి సింగం సిరీస్ సినిమాలతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఈయన యాక్షన్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకు విపరీతమైన పిచ్చి. హరి స్క్రీన్ ప్లే జెట్ రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. కోలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలతో మాస్ మసాలా యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన హరి సూపర్ హిట్ కొట్టడమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి ఈయన కోలీవుడ్ డైరెక్టర్ అయినప్పటికీ మొత్తం సౌత్ ఇండియా అంతటా అభిమానులు ఉండటం గమనార్హం.

హరి భార్య పేరు ప్రీతి.. ఆమె కూడా తెలుగు హీరోయిన్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ప్రీతిది పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. అలనాటి దివంగత నటి మంజుల.. నటుడు విజయ్ కుమార్ దంపతుల మూడవ కుమార్తె ఈమె. ఇకపోతే మంజుల తో వివాహం జరగకముందే విజయ్ కుమార్ కు ఒక పెళ్లి కూడా అయింది . నటుడు అరుణ్ విజయ్ ముందు భార్య ద్వారా జన్మించాడు. ఆ తర్వాత మంజుల విజయ్ కుమార్ కు రెండో భార్యగా ఆ ఇంటికి వెళ్ళింది. ఇక మంజుల , విజయ్ కుమార్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ ముగ్గురు కూడా హీరోయిన్లుగా నటించిన వారే.

మంజుల చెన్నై లో పుట్టి పెరిగినా..తెలుగు, తమిళ్, కన్నడ , మళయాళం సినిమాల్లో నటించింది. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల పక్కన హిట్ సినిమాలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వీరి పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి సినిమా చేసింది. రెండవ కుమార్తె శ్రీదేవి , మూడవ కుమార్తె ప్రీతి వీరందరూ కూడా తెలుగులో నటించిన వారే. ఇక ప్రీతి సింగం హరి డైరెక్షన్లో నటిస్తున్న సమయంలోనే అతడితో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ప్రీతి ఇంట్లో వాళ్ళను.. ప్రీతి వాళ్ళ పెద్ద అక్క వనిత ఒప్పించి మరీ వీరి వివాహం చేసిందట . అంతే ఏ రోజు కూడా ప్రీతి ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది వనిత.

Leave a Reply

Your email address will not be published.