జగపతిబాబు మందుకొట్టి చేసిన సినిమా ఏది..? ఎందుకు తాగినట్లు..?

By | April 26, 2022

టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబును పడిలేచిన కెరటంగా భావిస్తారు. సినీ ఇండస్ట్రీకి చెందిన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడైన జగపతిబాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగుతున్నారు. తండ్రి బ్యానర్లోనూ కొన్ని సినిమాలు చేసిన జగపతి ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోలో హీరోగానే కాకుండా విభిన్న తరహాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే చాలా సినిమాల్లో జగపతి బాబు మందుకొట్టి నటించిన సీన్స్ ఉన్నాయి. కానీ ఓ సినిమా కోసం కొడుకు కష్టాన్ని చూడలేక తండ్రి హాఫ్ బాటిల్ ను జగపతి బాబుకు పంపించాడట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మహానటులతో కలిసి సినిమాలు నిర్మించిన ఘనత విబి రాజేంద్రప్రసాద్ ది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఆరాధన, ఆత్మబలం, అక్కాచెల్లెళ్లు వంటి విజయవంతమైన సినిమాలు తీశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు జగపతి బాబు సినిమాల్లోకి రావొద్దని ఆయనను చెన్నైలో ఉంచి చదివించారు విబి రాజేంద్రప్రసాద్ గారు. కానీ స్టడీస్ పూర్తయిన తరువాత వైజాక్ వెళ్లిన ఆయన మొదట్లో వ్యాపారం చేసేవారు. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రయత్నాలను మొదలు పెట్టారు. అయితే ఈ విషయం మధ్యవర్తితో తెలుసుకున్న విబి రాజేంద్రప్రసాద్ కొడుకుతో కలిసి ఓ సినిమా తీశాడు.

1989 సంవత్సంలో జగపతి ఆర్ట్ పిక్సర్స్ జగపతి బాబుతో సింహస్వప్నం అనే సినిమాను తీశారు. ఈ సినిమాకు మధుసూదన్ రావు డైరెక్టర్. జగపతిబాబు హీరోగా వాణివిశ్వనాథ్, శాంతి ప్రియలు కలిసి నటించారు. ఇందులో జగపతిబాబు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఇది జగపతిబాబుకు మొదటి సినిమా. ఆ తరువాత ఇదే సంవత్సంలో పల్లవి పూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై పి.అనిల్ దర్శకత్వంలో ‘అడవిలో అభిమన్యుడు’ అనే సినిమాను తీశారు. ఇందులో జగపతిబాబుతో పాటు వినోద్ కుమార్, శాంతిప్రియలు కలిసి నటించారు. అంతేకాకుండా ఇందులో కృష్ణం రాజు కీలక రోల్ చేశారు.

అయితే ఈ సినిమా చేసే సమయంలో జగపతి బాబు చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ మొత్తం అడవిలో జరిగినందువల్ల జగపతిబాబు కొండలు, గుట్టలు ఎక్కాల్సి వచ్చింది. అయితే జగపతిబాబు పడుతున్న కష్టాన్ని తండ్రి రాజేంద్రప్రసాద్ చూడలేకపోయారు. దీంతో ఆయనకు కాస్త రిలాక్స్ ఇవ్వడానికి ‘హాఫ్ బాటిల్’ మందును ముందే పంపేవారట. ఈ విషయాన్ని జగపతిబాబు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘అంతపురం’ సినిమాలో జగపతిబాబు మందు తాగిన వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే ఈ సన్నివేశం కోసం జగపతిబాబు మందు కొట్టినట్లు ఆయనే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.