మోహన్ బాబు హీరోయిన్.. మహేశ్ బాబుకు వదిన.: ఎవరో తెలిస్తే షాకవుతారు..

By | April 26, 2022

టాలీవుడ్ ఇండస్ట్రీలో బంధువులు, స్నేహితులు అయినవారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమలో ప్రధానంగా ఉన్న నందమూరి, అక్కినేని, కృష్ణ, మెగాఫ్యామిలీలకు చెందిన వారు నటులుగా కొనసాగుతున్నారు. కొందరు సినిమాల్లోకి రాకముందు బంధువులైన వారు తరువాత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 1980 చివరి నుంచి 1990 మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోయన్లను దిగుమతి చేసుకునే సాంప్రదాయం బాగా పెరిగింది. ఇలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో కొందరు ఇక్కడే సెటిలయ్యారు. మరికొందరు ఇక్కడ సినిమాల్లో నటించి ఇతర ప్రదేశాల్లో ఉన్నారు. అయితే కొందరు ఇలా టాలీవుడ్ కు వచ్చిన బాలీవుడ్ నటీమణులు ఇక్కడి నటులకు బంధువులుగా మారారు. తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేశ్ బాబు బాలీవుడ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. అయితే నమ్రతా శిరోద్కర్ అక్క కూడా తెలుగు సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మరి అమె గురించి తెలుసుకుందామా..

1990 నుంచి ఒక సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఉందంటే ఆ సినిమాను చూసేందుకు యూత్ ఎగబడేవారు. బీ టౌన్ భామలకు అప్పట్లో ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉండేది. అంతేకాకుండా వారు నటించిన ఇక్కడి సినిమాలు దాదాపు హిట్టు కొట్టాయి. అయితే కొందరు చాలా సినిమాల్లో నటించగా.. మరికొందరు ఒకటి, రెండు సినిమాల్లో మెరిసి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కానీ వారు నటించిన సినిమాలు మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నాయి. స్టార్ హీరోలందరూ బాలీవుడ్ నటీమణులతో చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్టు చూపేవారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో నగ్మా, బొబ్బిలి రాజా చిత్రంలో దివ్యభారతి, క్రిమినల్ చిత్రంలో మనీషా కోయిరాలతో నటించి ఆకర్షించారు.

ఇదే సమయంలో మోహన్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అప్పట్లో పేరు సంపాదించారు. ఈ క్రమంలో సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో ‘బ్రహ్మ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 1992లో వచ్చింది. కథ పరంగానే కాకుండా పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఇందులో హీరోయిన్ గా శిల్పా శిరోద్కర్ కూడా నటించింది. ముసిముసి నవ్వులలోనా.. అనే పాటలో శిల్ప శిరోద్కర్ అద్భుతంగా కనిపిస్తుంది. అయితే తెలుగులో ఈ ఒక్క సినిమా చేసిన తరువాత మళ్లీ ఇక్కడి సినిమాల్లో కనిపించలేదు.

శిల్ప శిరోద్కర్ ఎవరో కాదు, మహేశ్ బాబుకు స్వయాన వదిన. అంటే మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ అక్క. ఇలా బాలీవుడ్ భామలు టాలీవుడ్ హీరోలకు బంధువులుగా మారారు. మహేశ్ విషయానికొస్తే వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన నమ్రతా శిరోద్కర్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో బంధువులు వ్యతిరేకించినా శిల్పా శిరోద్కర్ సపోర్టు చేసిందని అంటుంటారు. ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంది. ఆయన నటించిన ‘సర్కార్ వారి పాట’ త్వరలో విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published.