మరోసారి వార్తల్లోకెక్కిన నిహారిక..లుక్ చూస్తే షాక్..!!

By | April 26, 2022

గడిచిన నెల రోజుల క్రితం నుండి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న విషయం నిహారిక పబ్ వ్యవహారం. ఈమెకి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసు విషయం కూడా బయటికి రావడం జరిగింది. ఇక అంతే కాకుండా తన తప్పు లేకపోయినా సరే పబ్ లో ఉండడం వల్ల నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. దీంతో ఈమె పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్.. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు నిహారిక మాత్రం ఏ విధంగా స్పందించడానికి ఇష్టపడలేదు.

అయితే మెగా అభిమానులు మాత్రం నిహారిక ను కావాలని కొంతమంది ఇలా టార్గెట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారని కామెంట్ చేయడం జరుగుతూనే ఉంది. పబ్ లో కొంత మంది ఉన్నప్పటికీ కేవలం నిహారిక గురించే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇలా బురద జల్లుతున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నిహారిక జిమ్ లో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఇలా వైరల్ అవుతున్న ఫోటోలను నిహారిక షార్ట్ హెయిర్ తో సరికొత్త లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ సరికొత్త లుక్ లో నిహారిక మరింత అందంగా కనిపించడమే కాకుండా తన జిమ్ ట్రైనర్ తో నవ్వుతూ ఉన్న ఫోటోలలో కనిపించడంతో మెగా అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే తన భర్తతో కొన్ని విభేదాల కారణంగా కొద్ది రోజుల నుండి తన భర్తకు దూరంగా ఉంటోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై మెగా ఫ్యామిలీ ఏవిధంగా స్పందించలేదు. నిహారిక యాంకర్ గా పలు షో లకు పని చేయడంతో పాటుగా పలు వెబ్ సిరీస్ ల, సినిమా లలో కూడా నటించింది.

సినిమాలలో హీరోయిన్ గా ఎంత ట్రై చేసినప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం నిహారిక ను హౌస్ లోనే ఉండేవిధంగా హౌస్ అరెస్ట్ చేశారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిహారిక పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అందులో కూడా ఈమె సక్సెస్ కాలేకపోయింది. మరి అన్ని విషయాలకు నిహారిక ఎప్పుడు సమాధానం చెబుతుందో తెలియాలి.

Leave a Reply

Your email address will not be published.