ఎందరికో హిట్లు ఇచ్చినా.. ఒక్కహీరో ఆదుకోలేదు..: పూరి జగన్నాథ్

By | April 26, 2022

సినిమా జీవితం అన్నాకా.. ఎన్నో ఎత్తు వంపులు ఉంటాయి. ఒక్కోసారి స్టార్ గా మారిన వాళ్లు.. అంతలోనే దిగజారుతారు.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా సినిమా రంగానికి చెందిన వారు పైకి బాగానే కనిపిస్తున్నా.. వారిలో చెప్పుకోలేని ఎన్నో కష్టాలుంటాయి. అయితే కొందరు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి సక్సెస్ ఫుల్ జీవితాన్న ఆస్వాదిస్తున్నారు. కానీ కొందరు మధ్యలోనే ఈ రంగాన్ని వదిలి వేరే దారి చూసుకుంటున్నారు. కానీ పోయిన చోటే వెతుక్కోవడం సామెత తెలిసిన వారు మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతూ మంచి జీవితాన్ని పొందుతున్నారు.

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గురించి మొన్నటి యూత్ కు బాగా తెలుసు. బాచి సినిమాతో ఆరంగేట్రం చేసిన పూరి ఆ తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, బద్రి సినిమాలతో స్టార్ అయ్యాడు. ఆ తరువాత ఇడియట్ సినిమాతో సూపర్ డైరెక్టర్ గా మారాడు. పూరి జగన్నాథ్ తో సినిమాలు తీసేందుకు కొందరు నిర్మాతలు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. కానీ ఆయన రేంజ్ అలా సాగింది. కానీ ప్రతీ వ్యక్తి జీవితంలో ఎక్కడో ఓ చోట తడబట్లు తప్పనిసరిగా ఉంటాయి. పూరి లైఫ్లో కూడా ఓ స్టేజీకి వచ్చాక డౌన్ అయ్యాడు. ఆయన నిర్మాణంలో ఎన్టీఆర్ తో కలిసి ‘ఆంధ్రావాలా’ సినిమా తీశారు. కానీ ఇది బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.

అక్కడి నుంచి పూరికి వరుస ప్లాప్ లే వచ్చాయి. దీంతో సొంత ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయన నమ్మిన ఓ వ్యక్తి రూ.80 కోట్లు మోసం చేశాడట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఓ అద్దె ఇంట్లో రెంట్ కు ఉండాల్సి వచ్చింది. తాను ఎంతో గారాబంగా పెంచుకున్న పెట్స్ ను తన ట్రైనర్ కు ఇచ్చేశాడు. అయితే ఇక తన కెరీర్ డిస్ట్రబ్ అయిన సందర్భంలో తనను ఎవరూ ఆదుకోలేదని పూరి చెప్పాడు. తన సినిమలతో స్టార్లు గా మారిన వారు సైతం తన గురించి పట్టించుకోలేదని అన్నాడు. అయితే తన భార్య మాత్రం ఎప్పుడూ తనతో ఉంటూ సపోర్టుగా ఉండేదని తెలిపారు.

ఈ సమయంలో కమెడియన్ ఆలీ ఓ నగ తెచ్చి ఇచ్చాడు. దానిని ఇస్తూ ‘దీనిని ధరించండి.. మీకు పోయిన డబ్బు తిరిగి వస్తుంది’ అని పూరి భార్యకు ఇచ్చాడు. అయితే ఆమె ఆ నగ ధరించిన తరువాత ఆలీ చెప్పినట్లే జరిగింది. పూరి జగన్నాథ్ మళ్ళీ పాత పోజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు తన బ్యానర్ పై విజయ్ దేవరకొండ తో కలిసి ‘లైగర్’ సినిమా తీస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే సినిమా జీవితంలో ఉన్నవాళ్లు కుటుంబ సభ్యులను మాత్రమే నమ్మాలని, ఇతరులను నమ్ముకోవద్దని సూచిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published.