రఘువరణ్ చనిపోయే ముందు ఏం చేశారో తెలుసా..?

By | April 26, 2022

ఒకప్పుటి సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్లుకు గుర్తింపు ఉండేది. వారు చేసే విలనిజంతో భూమ్మీద ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా..? అనిపించేది. అంతలా పాత్రల్లో లీనమై ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. ఇలాంటి విలన్లలో రఘువరన్ ఒకరు. టాలీవుడ్ సినిమాల్లో రఘువన్ విలనిజం చూస్తే భయపడేవారు. శివ, పసివాడి ప్రాణం సినిమాల్లో ఆయన యాక్టింగ్ అదిరిపోద్ది. ఆ తరువాత రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రఘువరణ్ మెప్పించారు. సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాన్ తండ్రిగా రఘువరణ్ చేసిన యాక్టింగ్ కు కన్నీళ్లు వస్తాయి. అయితే రఘువరణ్ రియల్ గానే ఇప్పుడు మనమధ్య లేదు. ఆయన చనిపోయే ముందు ఇండస్ట్రీకి చెందిన కొందరిని పిలిచి పార్టీ ఇచ్చారు. ఎందుకో చూద్దాం..

సౌత్ సినిమా ఇండస్ట్రీలన్నీ కలిపి రఘువరణ్ 150 చిత్రాల్లో నటించారు. హిందీలోనూ కొన్ని సినిమాలో నటించారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని కొలెంగుడే ప్రాంతంలో 1948లో రఘువరణ్ జన్మించారు. వేలాయుధన్, కస్తూరి ఆయన తల్లిదండ్రులు. రఘువరన్ సినిమాల్లోకి వచ్చిన తరువాత రోహిణి అనే సినీ యాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణవాల వల్ల వీరు విడిపోయారు. ఆ తరువాత విడాకులు కూడా తీసుకున్నారు.

మొత్తం 13 భాషల్లో సినిమాల్లో నటించిన రఘువరణ్ తెలుగులో ‘కొండ పిడుగు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రఘువరణ్ ను ఎవరూ గుర్తుపట్టరు. కానీ శివ సినిమాతో ఆయన గుర్తింపు పొందాడు. ఈ సినిమా తరువాత రఘువరణ్ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. పలు భాషల్లో మాట్లాడడమే కాకుండా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న తపన ఆయనకు ఉండేది. విలనిజం చేసిన తరువాత రఘువరణ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘శివాజీ’ సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు.

సినిమా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో రఘువరణ్ మద్యానికి బానిస అయ్యారు. ఈ క్రమంలో ఆయన కాలేయం కూడా దెబ్బతింది. అయితే ఇక తన జీవితం ముగిసిందని రఘువరణ్ ముందే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఆయన చనిపోయే కొద్ది రోజుల ముందు ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులకు విందు ఇచ్చాడు. ఆ తరువాత మార్చి 19 2008లో గుండెపోటుతో కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published.