మెగా స్టార్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన శేఖర్ మాస్టర్.. ఎందుకంటే..?

By | April 26, 2022

మెగాస్టార్ చిరంజీవి గారు చేతి నిండా సినిమాలతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఈయన నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల అవనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించే మరి కొన్ని సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఆయన ఒక్కో సినిమా షూటింగును పూర్తి చేస్తున్నారు. బోలా శంకర్,గాడ్ ఫాదర్ వంటి సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవే కాకుండా బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమాను కూడా చిరంజీవి ఓకే చేశారట. మెగాస్టార్ నటించిన 154 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించనుండగా, మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ నడుస్తోంది.

కొందరు మాస్ మూలవిరాట్ అని అంటుండగా, ఇంకొందరేమో వాల్తేరు వీరయ్య అంటూ రకరకాల పేర్లను తెరమీదికి తీసుకొస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే పలు రకాల పేర్లు తెరమీదికి వస్తున్న వేళ టైటిల్ రివిల్ అయిపోయింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ టైటిల్ ని అనుకోకుండా ప్రేక్షకుల ముందు లీక్ చేశాడు. ఓ ఇంటర్వ్యూ లో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తాను తర్వాత చేసే సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతోపాటు తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నానని, ఇవే కాకుండా చిరంజీవి గారితో బోలా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య అనే సినిమాలు కూడా చేస్తున్నట్లు నోరు జారారు. ఈ సినిమా టైటిల్ ని అభిమానులు సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య టైటిల్ ని తెరమీదకు తీసుకువచ్చారు కానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

దీంతో వాల్తేరు వీరయ్య అనేది సినిమా టైటిల్ కాదని, వేరే టైటిల్ వస్తుందేమోనని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూ లో సినిమా పేరును లీక్ చేయడంతో చిరంజీవి గారు బాబి గారి దర్శకత్వంలో చేసే సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇంకోపక్క చిత్ర యూనిట్ శేఖర్ మాస్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి టైటిల్ ని అనౌన్స్ చేద్దామనుకునే సమయంలో శేఖర్ మాస్టర్ టైటిల్ రివిల్ చేయడంతో ప్రేక్షకులందరికీ సర్ప్రైస్ మిస్సయ్యిందని మేకర్స్ బాధపడుతున్నారట. ఇందులో భాగంగా శేఖర్ మాస్టర్ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. నేను అనుకోకుండా నోరు జారడంతో టైటిల్ అనౌన్స్ అయిపోయిందని, డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి నా మీద సీరియస్ అవుతారని అందుకే నేను మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని శేఖర్ మాస్టర్ అన్నట్లు సినీ సర్కిల్స్ లో ఓ వార్త అయితే చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published.